నయా ట్రెండ్.. నగరంలో మూగజీవాల కోసం పెట్-ఫ్రెండ్లీ కేఫ్‌లు

by Shyam |   ( Updated:2021-07-29 21:32:14.0  )
Pet-Friendly Cafes In Hyderabad
X

దిశ, ఫీచర్స్ : నాటి నుంచి నేటి వరకూ కుక్కలతో మానవునిది విడదీయరాని బంధం. అయితే కొంతకాలం గుమ్మం బయటే పరిమితమైన శునకాలకు నేడు మనతోపాటే సమానంగా బెడ్ రూముల్లో చోటు కల్పిస్తున్నాం. అంతేకాదు కుటుంబం కలిసి దిగే ఫొటోల్లో, పార్టీల్లో ‘పెట్ డాగ్స్’ ఉండాల్సిందే. అలాగే వెకేషన్ ప్లాన్ చేసినా, రెస్టారెంట్‌కు వెళ్లినా తమ కెనైన్స్ కూడా వెంటతీసుకెళ్తుంటారు. కానీ సందర్శించే అన్ని ప్రదేశాల్లో పెట్-ఫ్రెండ్లీ ఎన్విరాన్‌మెంట్ సరిగాలేక ఇబ్బంది పడుతుంటారు. ఈ క్రమంలోనే కొందరు పెట్ లవర్స్ ప్రత్యేకంగా కుక్కల కోసమే రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తూ.. వాటికి కావాల్సిన అన్నీ సౌకర్యాలు కల్పిస్తున్నారు. హైదరాబాద్‌లోనూ పెట్-ఫ్రెండ్లీ కేఫ్‌ల సంఖ్య క్రమంగా పెరుగుతుండగా.. పెట్ యాక్ససరీస్, క్లాత్స్ అందించే దుకాణాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.

విదేశాల్లో కుక్కల రెస్టారెంట్లే కాదు.. పిల్లులు, కాకులు, గుబ్లగూబలు, పావురాలకు కూడా స్పెషల్ హ్యాంగవుట్ ప్లేసెస్ ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ఈ తరహా కేఫ్స్ మనదేశంలోనూ దర్శనమిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు, గురుగ్రామ్, కలకత్తా, ముంబై, చెన్నయ్‌లో డాగ్ కేఫ్స్ ఉండగా.. ఛత్తీస్‌గఢ్, రాయ్‌పూర్‌లోని​‘మ్యావ్ ది క్యాట్ కేఫ్’ రెస్టారెంట్ నిర్వాహకులు పిల్లులకోసం ఓ కేఫ్‌ను డిజైన్ చేయడం విశేషం. ఇక భాగ్యనగరంలోనూ ప్రత్యేక పెట్-ఫ్రెండ్లీ కేఫ్స్‌ల్లో శునకాల కోసమే బిర్యానీ, మాకరోనీ, కేక్స్, ఐస్‌క్రీమ్స్, సూప్‌ వంటి డిషెస్ అందిస్తూ ఆయా కేఫ్స్ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి.

ద పెట్ కేఫ్, బంజారాహిల్స్ :

ట్రీట్ కోసం మీ పెట్ డాగ్‌ను బయటకు తీసుకెళ్లాలనుకుంటున్నారా? మీరు వీకెండ్‌లో ఊరెళ్లినప్పుడు మీ కుక్కను టేక్ కేర్ చేయడానికి ఎవరైనా కావాలా? లేదా మీ డాగ్‌ను సోషలైజ్ చేయాలని మీరు అనుకుంటున్నారా? అయితే బంజారా‌హిల్స్‌లోని ‘ద పెట్ కేఫ్’ వీటన్నింటికీ ఏకైక డెస్టినేషన్. మూడు ఫ్లోర్లలో నిర్వహిస్తున్న ఈ కేఫ్‌లో మొదటి రెండు అంతస్తుల్లో కేఫ్‌, మూడో ఫ్లోర్‌లో ‘డాగ్ బోర్డింగ్’‌కు కేటాయించారు. అంతేకాదు ఇప్పటివరకు ఈ కేఫ్ నిర్వాహకులు 150 వీధి కుక్కలను దత్తత తీసుకున్నారు. అడాప్ట్ చేసుకున్న కుక్కలకు ముందు మెడికేషన్ అందించి, అవసరమైన టీకాలు వేయిస్తారు. ఆ తర్వాత వాటికి కూర్చోవడం, హ్యాండ్ షేక్ ఇవ్వడం వంటి ప్రాథమిక విషయాలపై ట్రైనింగ్ అందిస్తారు. ఇక ఆ కేఫ్‌లోని పెట్ ఫుడ్ పదార్థాలను యజమానులు దేవెన్, అతని భార్య సోనమ్ స్వయంగా తయారుచేస్తామని తెలిపారు.

కేఫ్ డి లోకో – గచ్చిబౌలి

పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కేఫ్ కాగా.. లాక్‌డౌన్ కారణంగా ఈ కేఫ్‌ను మూసివేశారు. అయితే డాగ్ లవర్స్‌కు ప్లేగ్రౌండ్ అందించడం కోసం 600 చదరపు గజాల్లో కొత్త ప్రదేశానికి షిఫ్ట్ చేయబోతున్నారు నిర్వాహకులు. ఈ కేఫ్‌ను ప్రకృతి ప్రేమికుడైన సకర్వాల్ ప్రారంభించగా అతడి భార్య రుచిరా కూడా సాయం అందిస్తోంది. అలాగే వీరు శునకాల కోసం తయారుచేస్తున్న ప్రత్యేకమైన కేకులు, కుకీలు, పాఫ్ఫల్స్ ముందు మానవులపై టెస్ట్ చేసిన తర్వాతే ఆన్‌లైన్‌లో విక్రయిస్తారు. ఆహారా పదార్థాలతో పాటు, మాంసాన్ని కూడా పొడి రూపంలో అందించడం విశేషం. వీటిని 8-9 నెలల పాటు నిల్వ చేయవచ్చు. మాంసం పొడిరూపంలో ఉన్నా దాని ఎంజైములు, రుచి పోషకాలను కోల్పోదు. కేఫ్ డి లోకో నిర్వాహకులు ఇప్పటిరవకు 300కి పైగా కుక్కలను దత్తత తీసుకున్నామని తెలిపారు.

ద రోస్టరీ, బంజారాహిల్స్

ది బెస్ట్ కాఫీ రుచులకు ‘ద రోస్టరీ’ కేఫ్ ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ఇది పెట్-ఫ్రెండ్లీ కూడా. ఇక్కడి లగ్జరీ ఓపెన్ స్పేసెస్ శునకాలు స్వేచ్ఛగా ఆడుకోవడానికి వేదికగా నిలుస్తాయి. అప్పుడప్పుడు పెట్ ఈవెంట్స్, ఫుడ్ ఫెస్ట్, మ్యాచ్ మేకింగ్ మీట్స్ కూడా జరుగుతుంటాయి. అలాగే జూబ్లిహిల్స్‌లోని ద హోపరి కేఫ్ కూడా కెనైన్స్ హ్యాంగవుట్‌కు ఉత్తతమైన ప్లేస్. పెట్ వాకింగ్ కోసం అందమైన గార్డెన్ తీర్చిదిద్దారు. మాదాపూర్‌లోని హమ్మింగ్ బర్డ్ కేఫ్, జూబ్లిహిల్స్‌లోని ఆటమ్న్ లీఫ్, జీరో40, బంజారాహిల్స్‌లోని టెర్రసెన్ కేఫ్స్ పెట్ డాగ్స్‌కు ట్రీట్ ఇవ్వడానికి తీసుకెళ్లొచ్చు.

లగ్జరీ పెట్ క్లాతింగ్

2019లో నిమిషా దీక్షిత్, ఇబాదత్ శర్మలు కలిసి డాగ్-ఓ-బౌ (Dog-O-Bow)ను కూకట్‌పల్లిలో ప్రారంభించారు. పెట్ యానిమల్స్‌కు సంబంధించిన క్లాత్స్, యాక్ససరీస్, గ్రూమింగ్ కిట్స్, స్కిన్ అండ్ బాడీ కేర్ ప్రొడక్ట్స్, టాయ్స్, ఫీడింగ్ బౌల్స్, బెడ్స్, ఫుడ్ వంటి ఉత్పత్తులు ఇక్కడ లభిస్తాయి. మెడలో ధరించే బోస్(పట్టీలు), హెయిర్ క్లిప్స్, స్వెట్‌షర్ట్స్, జెర్సీలు, షెర్వానీ, బాంద్నా, ఫ్రాక్స్ కూడా లభిస్తాయి. ఎక్స్ఎస్, ఎస్, ఎమ్, ఎల్ సైజుల్లో దుస్తులతో పాటు కస్టమ్ మేడ్, క్లాతింగ్ కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు రెయిన్ కోట్స్, ఫెస్టివ్ వేర్ కూడా ఉండగా.. ఎలర్జీ ఫ్రీ దుస్తులు ఇక్కడ ప్రత్యేకం. బర్త్ డే, పెళ్లిళ్ల సందర్భంలో ఇష్టానుసారం మ్యాచింగ్ క్యాస్ట్యూమ్స్ కూడా అందిస్తారు.

క్యాట్స్, రాబిట్స్, పక్షులకు కూడా ఇక్కడ దుస్తులు డిజైన్ చేయించుకోవచ్చు. ‘డాగ్ ఓ బౌ’కు అమెరికా, మలేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దుబాయ్ కస్టమర్లు కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన బ్రాంచ్ చెన్నయ్‌లో కూడా ఉంది.

Pet

Advertisement

Next Story

Most Viewed