ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని.. యువకుడి ఆత్మహత్య

by Aamani |
ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని.. యువకుడి ఆత్మహత్య
X

దిశ, నేరడిగొండ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఉద్యోగ నోటిఫికేషన్ రావడం లేదని మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నేరడిగొండ మండలంలోని బుద్దికొండ గ్రామంలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానిక ఎస్సై విజయ్ కుమార్ కథనం ప్రకారం.. బుద్దికొండకు చెందిన దాసరి రమేష్ కొడుకు దాసరి ఓంకార్ ఉన్నత చదువులు చదివాడు. ఏళ్లు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోవడంతో మనస్తాపం చెందిన యువకుడు తమ పొలంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు.

Advertisement

Next Story