వికారాబాద్ అడవుల్లో హత్య.. ఆమెపైనే అనుమానం

by Shyam |   ( Updated:2020-07-14 09:41:41.0  )
వికారాబాద్ అడవుల్లో హత్య.. ఆమెపైనే అనుమానం
X

దిశ, వెబ్ డెస్క్: వికారాబాద్ అనంతగిరి అడవుల్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ఈ హత్యకు తన భార్య అక్రమ సంబంధమే కారణమని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంధువుల కథనం ప్రకారం.. నందిగామ మండలం, చెగూర్ గ్రామానికి చెందిన బైడ్ల చెన్నయ్య (38) హత్యకు గురయ్యాడు. దానికారణం చెన్నయ్య భార్య శశికళ(35) అదే గ్రామానికి చెందిన బైడ్ల రమేష్ (28) తో అక్రమ సంబంధం పెట్టుకుందని చెబుతున్నారు. దాంతో భర్తను వదిలించుకుందామని భావించిన శశికళ, ప్రియుడు రమేష్‌తో కలిసి భర్త చెన్నయ్యను హత్య చేసి అనంతగిరి అడవిలో పడేసి వెళ్లారని బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ హత్య జరిగిన నాలుగు రోజులు తర్వాత ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed