చేపల వేటకు వెళ్లి.. వలలో చిక్కి మృతి

by Shyam |
చేపల వేటకు వెళ్లి.. వలలో చిక్కి మృతి
X

దిశ, మహబూబ్‌నగర్: చేపల వేట ఓ వ్యక్తి నిండు ప్రాణాలు తీసింది. కాల్వలో చేపల వేట కొనసాగిస్తుండగా కాళ్లు వలలో చిక్కుకుని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా మదనాపురం మండలం తిరుమలయ్యపల్లి గ్రామ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ధర్మన్న(35) గ్రామంలోని బీమా ఫేస్ టూ కాల్వలో చేపల వేటకు వెళ్లి కాళ్లకు వలలో చిక్కి మృతిచెందాడు. ధర్మన్నకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నట్టు ఉన్నారు.

Advertisement

Next Story