- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రియుడి కోసం ప్రియురాలి పోరాటం.. ప్రేమపేరుతో లోబర్చుకుని అబార్షన్ వరకు వెళ్లినా..!
దిశ, కారేపల్లి : ప్రేమిస్తున్నానంటూ వెంటపడటమే కాకుండా మాయమాటలతో లోబరుచుకుని.. పెళ్ళి చేసుకోమంటే ముఖం చాటేస్తున్న ప్రియుడి ఇంట్లో ప్రియురాలు నిరసన దీక్షకు దిగింది. ఈ ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మండల కేంద్రమైన కారేపల్లిలో బుధవారం వెలుగుచూసింది. మండలంలోని ఎర్రబోడుకు చెందిన కోనం సునిత ఖమ్మంలో డిగ్రీ చదువుతోంది. కారేపల్లి మోడల్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నప్పుడు అదే మండలానికి చెందిన సముద్రాల వేణుతో అతని సోదరి ద్వారా పరిచయం ఏర్పడగా.. అది కాస్తా ప్రేమగా మారింది.
సునిత డిగ్రీ చదువుతున్న సమయంలో వేణు తరచూ వెళ్లి.. ప్రేమిస్తున్నానని, పెళ్లిచేసుకుంటానని మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ప్రేమించిన యువకుడి కోసం తల్లిదండ్రులను సైతం కాదని యువకుడిని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే సునిత గర్భవతి అని తెలుసుకుని ఆమెకు మాయమాటలు చెప్పి అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత పెళ్లి గురించి అడిగితే తప్పించుకుని తిరగడం ప్రారంభించాడు.
వేణు నిజస్వరూపం తెలిసాక బాధితురాలు బోరున విలపించింది. తనను పెళ్ళిచేసుకోవాలని యువకుడిని చాలా వేడుకుంది. ఈ విషయమై ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదుచేసి కౌన్సిలింగ్ ఇప్పించినా అతనిలో మార్పు రాలేదు. దీంతో బాధితురాలు యువకుడి ఇంటి ఎదుట నిరసనకు దిగింది. తనకు వేణుతో పెళ్ళి ముఖ్యమని, కేసు పెట్టించి జైలుకు పంపించడం తన ఉద్దేశ్యం కాదని, పెళ్లికి వేణును ఒప్పించాలని పెద్దమనుషులను, యువకుడి తల్లిదండ్రులను వేడుకుంటోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కారేపల్లి ఎస్సై పి.సురేష్ యువకుడికి కౌన్సిలింగ్ నిర్వహించాడు.