- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసులకు ప్రజలు సహకరించాలి: సీపీ జోయల్ డేవిస్
by Shyam |
X
దిశ, మెదక్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్ నిబంధనలను పాటిస్తూ ప్రజలు పోలీసులకు సహకరించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ పిలుపునిచ్చారు. సోమవారం సీపీ మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాధి నివారణ కోసం కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. మనిషి జీవితంలో ప్రాణం కంటే ముఖ్యమైనది మరొకటి లేదని ఆయన హితవు పలికారు. అవసరం లేకున్నా రోడ్లపై తిరిగే వాహనాలను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సీపీ సూచించారు. మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. లాక్‌డౌన్ నిబంధనలను పాటించని వ్యక్తులు, వ్యాపారస్తులపై ఇప్పటికే కేసులు నమోదు చేశామని సీపీ జోయల్ డేవిస్ గుర్తు చేశారు.
tag: CP Joel Davis, comments, People, cooperate, Police, Siddipet
Advertisement
Next Story