సైబర్ నేరాలపై అవగాహన అవసరం : ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు

by Shyam |
సైబర్ నేరాలపై అవగాహన అవసరం : ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు
X

దిశ, మహబూబ్ నగర్: సైబర్ నేరాల పట్ల ప్రజలు పూర్తి అవగాహన కలిగి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు అన్నారు. సైబర్ మోసగాళ్ల బారి నుండి డబ్బులు పోగొట్టుకోకుండా ప్రజలకు అవగాహన కల్పించే పోస్టర్ ను శనివారం ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ, ఆన్ లైన్ ద్వారా లావాదేవీలు నడిపేవారు కొత్త వ్యక్తుల మాటలను నమ్మరాదని, తెలియని మెసేజ్ లపై క్లిక్ చేయరాదని తెలిపారు. సైబర్ నేరగాళ్లు మాయమాటలు చెప్తూ, బహుమతులు వచ్చాయని, లాటరీ తగిలిందని, లోన్లు ఇస్తామని, ఇతరత్రా ఆశ చూపి ఆన్ లైన్ ద్వారా డబ్బులకు ఎర వేస్తారని, అటువంటి వ్యక్తులు పంపే మెసేజ్ లకు స్పందించరాదని ఎస్పీ వివరించారు.

ఒకవేళ అనుకోకుండా సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటే, తక్షణమే 155260 లేదా డయల్ 100 నంబర్లకు ఫోన్ చేసి డబ్బులు పోగొట్టుకున్న విషయం ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. తమ అకౌంట్ లో డబ్బులు పోయిన 24 గంటల లోపుగా పై తెలిపిన నంబర్లకు ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న డబ్బులు వెనక్కి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. స్మార్ట్ ఫోన్ వాడే పిల్లల పట్ల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు, డి.ఎస్.పి. బి.కిషన్, ఇన్స్పెక్టర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed