- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పల్లె సోయి పట్నంకు రాదా !
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశంమొత్తం లాక్‌డౌన్ అయి స్వీయ నియంత్రణ పాటిస్తుంటే… పట్నం వాసులు మాత్రం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. పోలీసులు ఎంత మొరపెట్టుకున్నా, లాఠీలను ఝుళిపించినా డోంట్‌కేర్ అనుకుంటూ రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు. ఓవైపు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తులను తూచా తప్పకుండా స్ట్రిక్ట్‌గా పాటిస్తూ పొలిమెరల్లో కంచెలు ఏర్పాటు చేస్తుంటే, పట్నాల్లోని విద్యవంతులు మాత్రం బండ్లపై తిరగడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు చిర్రెత్తి దంచుడు బేరం పెడుతున్నారు. అయినా సందులు, గొందులు తిరుగుతూ ఏదో ఓ మూల నుంచి రోడ్డెక్కి వాళ్ల ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు.
ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, అభినందిచాల్సింది గ్రామీణ ప్రాంతాల ప్రజలు, యువకులనే. ఎందుకంటే సర్కార్ ఒక్క ప్రకటన చేయగానే తమకు తాముగా స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇంటి గడప దాటకుండా సమ సమాజ శ్రేయస్సు కోసం తమవంతుగా కృషి చేస్తున్నారు. కనీసం ఊర్లోకి వచ్చిన పోలీసులతో చెప్పించుకునే పరిస్థితులు తెచ్చుకోకుండా కలో గంజో తాగి తలదాచుకుంటున్నారు. పెద్దగా చదువుకొని అవ్వ, తాతల నుంచి, డిగ్రీలు, పీజీలు చేసిన గ్రామీణ యువకులు హోం క్వారంటైన్‌కు ప్రిఫరెన్స్ ఇచ్చి పట్నం వాసులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మా ఊర్లోకి ఎవరూ రావొద్దు, మేం కూడా ఏ గ్రామానికి వెళ్లం, ఎవరి ఇళ్లలో అడుగు పెట్టబోమంటూ ప్రతిజ్ఞలు చేస్తూ సైనికుల్లా పనిచేస్తున్నారు. గ్రామ శివార్లలో బోర్డులు ఏర్పాటు చేయడమే కాకుండా కంప చెట్లు కొట్టివేసి, రాళ్లు అడ్డం పెడుతూ తమ కోసం ,గ్రామాల రక్షణ కోసం నడుం బిగించి లాక్‌డౌన్‌ను నూటికి నూరుశాతం సక్సెస్ చేస్తున్నారు.
ఇక పట్నం వాసుల తీరైతే పేరు గొప్ప ఊరు దిబ్బలా తయారైంది. పెద్ద చదువులు చదువుకొని, క్రెడిట్ కార్డు వాడే నాలెడ్జ్ ఉండి.. ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవాళ్లందరూ కరోనా వైరస్ కట్టడికి కనీసం సోషల్ డిస్టెన్స్ కూడా పాటించడం లేదు. చీటికీ మాటికీ బైక్‌లపై బయటకు వస్తూ పోలీసుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. టీవీలు, పేపర్లలో ప్రధాని, కేంద్రమంత్రులు, సీఎంలు, మంత్రులు, ఉన్నతాధికారులు ఓవైపు రెండు చేతులెత్తి దండం పెడుతున్నా, పోలీసులు వారిస్తున్నా సింపుల్‌గా లైట్ తీసుకుంటున్నారు. సూపర్‌మార్కెట్లు, కూరగాయల షాపులు, డిమార్ట్‌ల దగ్గర సామాన్యులు ఓ క్రమ పద్ధతిలో కనీసం రెండు ఫీట్ల దూరంలో ఉంటూ సరకులు తీసుకుంటుంటే, ఆఫీసర్ రేంజ్‌ల బిల్డప్‌లు కొట్టే కొందరు నగర వాసులు అన్నీ బేఖాతరు చేస్తూ షాపుల్లోకి దూసుకెళ్లేందుకే ప్రిఫరెన్స్ ఇస్తూ మనషులను రాసుకుంటూ వెళ్తున్నారు.
కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు గ్రామీణ ప్రాంతాల్లో స్వీయ నియంత్రణ పాటిస్తూ పక్కవాళ్ల ప్రాణాలకు హానీ చేయకుండా ఆదర్శంగా నిలుస్తుంటే, బాగా చదువుకొని అన్నీ మాకే తెలుసు అని గప్పాలు కొట్టే పట్నవాసులు మాత్రం కనీసం మెచ్యూరిటీ లేకుండా రాకపోకలు సాగిస్తున్నారు. వైరస్ బారిన పడితే కుటుంబం, సమాజం మొత్తం విపత్కర పరిస్థితుల్లోకి వెళ్తందున్న సోయి మరిచి తిరుగుతున్నారు. వీళ్ల చదువులు, చేసే పనులను పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుని ఫర్‌ఫెక్ట్‌గా ప్రభుత్వ ఆదేశాలను పాటించే వారే గొప్పువారు, బెటర్ అనిపిస్తుంది. కానీ పెద్ద చదువులతో కార్లలో తిరుగుతూ ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆదేశాలను బేఖాతరు చేస్తున్నవారిని ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియడం లేదు. ఇలాంటి సందర్భాల్లోనే పెద్దలు చెప్పినట్టు పల్లెలే ప్రగతిగోమ్మలనిపిస్తుంది.. మరి పట్టణ వాసుల సంగతి వారి విచక్షణకే వదిలేద్దాం.
Tags: Hyderabad Public, Disobey orders, village People good, coronavirus, Health, PM Modi, Cm KCR