భూతగాదాల్లో మూడో వ్యక్తిపై పీడీ యాక్ట్..!

by  |
భూతగాదాల్లో మూడో వ్యక్తిపై పీడీ యాక్ట్..!
X

దిశ, హుస్నాబాద్:

భూతగాదాల్లో ఫిర్యాదు, ప్రతివాది తప్ప మూడో వ్యక్తిపై జోక్యం చేసుకుంటే ఆ వ్యక్తిపై పీడీ యాక్డ్ కేసు నమోదు చేయనున్నట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి.జోయల్ డేవిస్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ సబ్‎డివిజన్ పోలీస్ ఉన్నతాధికారుతో చేర్యాల సర్కిల్ ఆఫీసులో పెండింగ్ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హుస్నాబాద్ ఏసీపీ మహేందర్, సీఐలు రఘుపతిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐలు శ్రీధర్, రవి, మోహన్ బాబు, నరేందర్ రెడ్డి, సంపత్, రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డి.జోయల్ డేవిస్ మాట్లాడుతూ.. హుస్నాబాద్, అక్కన్నపేట, కొహెడ, మద్దూర్, చేర్యాల, కొమురవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో క్యాలీటి ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసి నేరస్తులకు శిక్షపడేలా చేయాలన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారం కేసుల్లో సాంకేతికతను ఉపయోగించి నేరస్తుడిని పట్టుకొవాలని తెలిపారు. సీసీటీఎస్ఎస్ ప్రాజెక్టు ద్వారా ప్రతి దరఖాస్తు, ఎఫ్ఐఅర్, సీడీఎఫ్, పార్ట్-1, పార్ట్-2 రిమాండ్ సీడీ, ఛార్జిషీట్, కోర్టు డిస్పోజల్‎లను ఆన్‎లైన్‎లో ప్రతిరోజు ఎంటర్ చేయలని ఆదేశించారు. పోలీస్ డివిజన్ పరిధిలో ఎవరైనా భూతగాదాల్లో మూడో వ్యక్తి అనవసరంగా జోక్యం చేసుకుంటే వెంటనే సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నెంబర్ 7901100100, పోలీస్ కమిషనర్ నెంబర్ 8332921100, డయల్ 100కు సమాచారం అందించాలన్నారు.

Next Story

Most Viewed