- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, టీటీడీకి ధన్యవాదాలు: పవన్ కల్యాణ్
by srinivas |
X
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లో 1400 మంది ఔట్ సోర్సింగ్ కార్మికులపై వేటు పడడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో వారిని ఆదుకోవాలని టీటీడీని కోరారు. దీనిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, టీటీడీకి ధన్యవాదాలు తెలిపారు. దీనిపై ట్వీట్ చేస్తూ… 1400 మంది కార్మికులను కొనసాగించాలంటూ ప్రభుత్వం, టీటీడీ తీసుకున్న నిర్ణయం సముచితంగా ఉందని అన్నారు. కార్మికులను విధుల్లోకి తీసుకోవడం ద్వారా మానవత్వం చాటారని కొనియాడారు. శ్రీవారిని నమ్ముకుని 15 ఏళ్లుగా సేవ చేస్తున్నవారికి న్యాయం చేశారని పేర్కొన్నారు.
tags: ttd, janasena, pawan kalyan, ysrcp, twitter
Advertisement
Next Story