నిమ్మగడ్డ కేసులో ఏపీ హైకోర్టు తీర్పుపై పవన్ స్పందన

by srinivas |   ( Updated:2020-05-29 05:19:55.0  )
నిమ్మగడ్డ కేసులో ఏపీ హైకోర్టు తీర్పుపై పవన్ స్పందన
X

దిశ, అమరావతి : నిమ్మగడ్డ రమేష్ కేసులో హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసిందని, ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం ఇనుమడింపజేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీ ఎన్నికల కమిషనర్‌ను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు రద్దు చేసింది. ఈ క్రమంలోనే రాజ్యంగ బద్ధంగా ఏర్పాటు చేయబడ్డ వ్యవస్థలను ప్రభుత్వాలు ఎలా పడితే అలా మార్చడానికి ప్రయత్నిస్తే న్యాయ విభాగాలు రక్షిస్తాయని మరోసారి రుజువైందని పవన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు వెళ్లకుండా, హైకోర్టు ఆదేశాల మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా మళ్లీ కొనసాగించాలని, తద్వారా రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించాలని కోరారు. ఆనాడు కరోనా సంక్షోభం ఎంత ప్రమాదకరమైందో ఎన్నికల కమిషనర్ హోదాలో ఆయన నిర్ణయం సరైందేనని పవన్ గుర్తుచేశారు.అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ స్పందించిన తీరును ప్రజాస్వామ్యవాదులెవరూ హర్షించలేదని చెప్పుకొచ్చారు.

కరోనా నేపథ్యంలో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్న సమయంలో ప్రభుత్వానికి ఎన్నికలే లక్ష్యంగా ఈసీని తొలగించే ప్రక్రియను ముందుకు తీసుకొచ్చింది. ఈ ప్రక్రియలో భాగంగా రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ను పరిగణలోకి తీసుకోలేదన్నారు. నియంతృత ధోరణితో పాలన చేస్తే న్యాయ వ్యవస్థ ఊరుకోదని, అధికార యంత్రాంగం రాజ్యాంగంపై, చట్టాలపై పాలకులకు అవగాహన కల్పించాలని, లేనియెడల న్యాయస్థానాల ఎదుట సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని పవన్ కల్యాణ్ సూచించారు.

Advertisement

Next Story