- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మహానీయులకు జనసేనాని ప్రణామాలు

దిశ, వెబ్‌డెస్క్: ఎందరో వీరుల త్యాగఫలం మన స్వాత్రంత్రం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. భారత దేశ సాతంత్ర సమరయోధులు బాల గంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్‌ల జయంతిని జనసేన అధ్యక్షుడు పురస్కరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రకటన విడుదల చేశారు. దేశ త్యాగధనులలో అగ్రగణ్యుడు లోకమాన్య బాల గంగాధర్ తిలక్ అని కొనియాడిన పవన్.. భారత దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో స్వర్గీయ చంద్రశేఖర్ ఆజాద్ ముందు వరుసలో ఉంటారని చెప్పారు.
స్వాతంత్రం నా జన్మ హక్కు అని గర్జించిన భరతమాత ముద్దు బిడ్డ జయంతి ఈ రోజు అని ఆయన గుర్తు చేశారు. అలాగే, చంద్రశేఖర్ ఆజాద్ ఉద్యమ స్ఫూర్తిని యువత పుణికిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. బ్రిటీషర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన సాహోసోపేత విప్లవ పంథా ఆజాద్ సొంతమన్నారు. వారిద్దరూ జన్మించిన పుణ్య దినం సందర్భంగా తన తరఫుణ, జనసేన తరఫుణ ప్రణామాలు అర్పిస్తున్నామని పవన్ వేరు వేరు ప్రకటనల్లో తెలిపారు.