‘కార్మికుల పక్షాన పోరాడేది కాంగ్రెస్సే’

by Shyam |
‘కార్మికుల పక్షాన పోరాడేది కాంగ్రెస్సే’
X

దిశ, నల్లగొండ: కార్మికుల పక్షాన పోరాడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో లైట్ మోటార్స్ వెహికిల్ డ్రైవర్లకు ఆయన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవడానికి సుమారు 20 రోజులకు పైగా పడిగాపులుకాయాల్సి వస్తోందన్నారు. ఫలితంగా తూకంలో తేడా వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. కంది పంట రైతులు ధాన్యాన్ని అమ్మి మూడు నెలలు గడుస్తున్నా.. ఇంతవరకూ వారి ఖాతాలో డబ్బులు జమ కాలేదని ఆరోపించారు.

tag: patel ramesh reddy, congress, daily needs, distribution, nallagonda

Next Story

Most Viewed