మంత్రి పువ్వాడ సపోర్ట్.. పరుచూరికి కీలక పదవి.?

by Sridhar Babu |
మంత్రి పువ్వాడ సపోర్ట్.. పరుచూరికి కీలక పదవి.?
X

దిశ, భద్రాచలం : చర్ల మండలానికి డీసీఎంఎస్ డైరెక్టర్ పదవి లభించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. డీసీఎంఎస్ డైరెక్టర్‌గా ఉన్న దుమ్మగూడెం పీఏసీఎస్ అధ్యక్షుడు దాట్ల వెంకట సత్యనారాయణరాజు ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో డీసీఎంఎస్ డైరెక్టర్ పోస్టు ఖాళీ ఏర్పడింది. ఈ స్థానాన్ని త్వరితగతిన భర్తీ చేయడానికి అధికారులు, పాలకమండలి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. చర్ల పీఏసీఎస్ అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పరుచూరి రవికుమార్‌ డీసీఎంఎస్ డైరెక్టర్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

ఈ పదవి విషయంలో రవికుమార్‌కి రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సపోర్టు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. చర్ల మండలం నుంచి గతంలో డాక్టర్ ఎంఎస్ నానాజీ డీసీఎంఎస్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇపుడు ఆ పదవి పరుచూరి రవికుమార్‌కి దక్కితే మండలం నుంచి డీసీఎంఎస్ డైరెక్టర్ పదవి పొందిన రెండవ వ్యక్తిగా ఆయన నిలుస్తారు.

Advertisement

Next Story

Most Viewed