- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వకీల్ సాబ్.. బొమ్మ హిట్ అంతే: పరుచూరి
పింక్ రీమేక్‌గా వస్తున్న వకీల్ సాబ్ ఫస్ట్ లుక్.. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో మరోసారి రుజువు చేసింది. పవన్ కమింగ్ బ్యాక్ మూవీ అయిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. హిందీలో సూపర్ హిట్టయిన పింక్ సినిమాలో అమితాబ్ చేసిన పాత్రను తెలుగులో పవన్ చేస్తుండగా.. అందరి లాగే ఈ చిత్రానికి ఎలాంటి టైటిల్ పెడతారని ఆసక్తిగా ఎదురు చూశారట పరుచూరి గోపాల కృష్ణ. ‘వకీల్ సాబ్’ పోస్టర్ రిలీజ్ చేయడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట.
‘సాధారణంగా లాయర్ పాత్రలు ప్రధానంగా ఉన్న సినిమాలకు.. గతంలో లాయర్ విశ్వనాథ్, లాయర్ భారతీదేవి లాంటి పేర్లు పెట్టారు. అదే ఫాలో అవుతూ సినిమా టైటిల్ ఉంటుందనుకున్నా.. అయితే ట్రెండ్‌కు తగ్గట్లుగా వకీల్ సాబ్ పేరు పెట్టడం చాలా కొత్తగా అనిపించింది’ అన్నారు పరుచూరి. ఆ టైటిల్ సజెస్ట్ చేసిన వారికి నమస్కారం పెట్టారు. ‘సాబ్ అనే పదం.. నిన్ను ప్రపంచమంతా గొప్పగా గౌరవిస్తుందని చెప్తోంది’ అని అన్నారు. కుల మత బేధం లేకుండా ప్రతీ ఒక్కరినీ సినిమా హాళ్లకు రప్పించే దమ్ము ఆ టైటిల్‌లో ఉందని పరుచూరి అభిప్రాయపడ్డారు. యంగ్ హీరోయిన్ శృతి హాసన్‌ను పవన్ కళ్యాణ్ భార్యగా చూపెట్టడం సినిమాకు మరో ప్లస్ అవుతుందన్నారు. హీరోయిన్ ప్రతిభను పూర్తిగా వాడుకున్న సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని.. వకీల్ సాబ్ విషయంలో ఇది జరగబోతుందని పరుచూరి గోపాల కృష్ణ వెల్లడించారు.