- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పార్ట్ టైం జాబ్స్ అంటూ వల..
దిశ,తెలంగాణ బ్యూరో : కరోనా మహమ్మారి ఎందరినో నిరుద్యోగులుగా మార్చింది. స్టార్టప్ కంపెనీలన్నీ మూసేసుకోవాల్సి వచ్చింది. దీంతో ఎందరో తమ ఉద్యోగాలను కోల్పోవడమే కాకుండా గ్రాడ్యుయేషన్ పూర్తయినా జాబ్ లేక ఇబ్బంది పడాల్సి వస్తోంది. దీనినే సైబర్ నేరగాళ్లు క్యాచ్ చేస్తున్నారు. ఉద్యోగాలిపిస్తామంటూ యువతకు వల వేస్తున్నారు. ఇంట్లో ఉంటూ పార్ట్ టైం వర్క్ చేసుకోవచ్చని.. రోజూ గంట పనిచేస్తే నెలకు వేలల్లో సంపాదించుకునే సువర్ణ అవకాశం అని మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిపై అప్రమత్తంగా ఉండాలంటున్నారు సైబర్ క్రైం పోలీసులు.
హైదరాబాద్‌కు చెందిన ఓ గ్రాడ్యుయేట్ ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఇప్పటివరకూ చాలా ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ వస్తున్నాడు. అయితే కరోనా మొదటి వేవ్‌కు ముందు ఓ స్టార్టప్ కంపెనీలో సెలెక్ట్ అయ్యాడు. అయితే కరోనాతో కారణంగా నష్టాలు వచ్చి ఆ కంపెనీని ఎత్తేశారు. దీంతో నిరాశ చెందిన ఆ యువకుడు ఆన్‌లైన్‌లో ఉద్యోగాల కోసం చూస్తుండగా అమెజాన్ కంపెనీలో పార్ట్ టైం జాబ్ అని నోటిఫికేషన్ వచ్చింది. వెంటనే ఆ నెంబర్‌కు కాల్ చేసి ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ కంప్లీట్ చేశాడు. అయితే డబ్బులు అడగడంతో అప్పు చేసి మరి రూ.15వేలు పంపించాడు. వారంలో జాయిన్ అవ్వాలని సూచించగా 2 నెలలు అయినా అక్కడి నుంచి ఎలాంటి కాల్ రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించాడు. వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నిరుద్యోగ యువకులు, గృహిణులే టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగాలిప్పిస్తామని ఫేక్ మెసేజీలు పంపిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. నిత్యం ఇలాంటి కేసులు బయటకొస్తున్నా జాబ్ వస్తుందన్న ఆశ యువతను మోసపోయేలా చేస్తున్నాయి. అయితే ఇలాంటి వారిపైనే సైబర్ క్రైం పోలీసులు దృష్టి సారించారు. మల్టీ నేషనల్ కంపెనీలో పార్ట్ టైం జాబ్స్ అందుబాటులో ఉన్నాయని ఓ మొబైల్ నెంబర్‌ని జత చేసి డైరెక్ట్ మెసేజ్‌ను పంపిస్తారని పోలీసులు వెల్లడించారు. అయితే జాబ్ సర్చ్ చేస్తూ విసిగిపోయి ఉన్నవారు పాకెట్ మనీ అయినా సంపాదించుకోవచ్చనే భావనలో నేరగాళ్లు ఉచ్చులో చిక్కుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి వారికి పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. సోషల్ మీడియా వేధికగా వివిధ ప్రకటనలతో అప్రమత్తం చేస్తున్నారు. సైబర్ నేరం జరిగితే వెంటనే 155260 నెంబర్‌కు ఫోన్ చేసి తెలపాలని పోలీసులు సూచిస్తున్నారు.