తంతే విదేశాల్లో పడ్తావ్.. ఎమ్మెల్యేకు పరిటాల శ్రీరామ్ వార్నింగ్

by srinivas |   ( Updated:2021-03-08 02:13:15.0  )
తంతే విదేశాల్లో పడ్తావ్.. ఎమ్మెల్యేకు పరిటాల శ్రీరామ్ వార్నింగ్
X

దిశ వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లాలో రాజకీయ వేడి క్రమక్రమంగా పెరిగిపోతోంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి, పరిటాల ఫ్యామిలీ మధ్య విబేధాలు చినికిచినికి గాలివానలా మారుతున్నాయి. అనంతపురం రాజకీయాల్లో మరోసారి తెరపైకి వచ్చిన హత్యా రాజకీయాలు ఎటువైపు దారితీస్తాయనే దానిపై రాజకీయ వర్గాలు వేచిచూస్తున్నాయి.

‘జేపీ దివాకర్ రెడ్డిని సునీత టీడీపీలోకి ఎందుకు రాణిచ్చారు. మంత్రి పదవి కోసమే సునీత రాజీ పడ్డారా?.. మంత్రిగా ఉన్నప్పుడు సునీత ఏనాడైనా ధర్మవరం వచ్చారా?’ అంటూ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కేతిరెడ్డికి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ కౌంటర్ ఎటాక్ చేశారు.

‘పాస్‌పోర్డ్, వీసా సిద్ధం చేసుకో.. ఈ సారి తంతే విదేశాల్లో’ పడ్తావ్ అంటూ శ్రీరామ్ హెచ్చరించారు. జేసీ ఫ్యామిలీ టీడీపీలో చేరడం తమ అంతర్గత వ్యవహారమని, మీ తండ్రి హయాంలో జేసీ ఏ పార్టీలో ఉన్నారని శ్రీరామ్ ప్రశ్నించారు. పరిటాల లేకుంటే మీ తండ్రి నామినేషన్ వేయలేకపోయాడని, మీ నాన్న హత్య కేసులో కనీసం సాక్ష్యం చెప్పలేకపోయావంటూ కేతిరెడ్డిపై శ్రీరామ్ ఫైర్ అయ్యారు.

కేతిరెడ్డి ఖాళీ సూట్‌కేసుతో ధర్మవరం వచ్చారని, ఎమ్మెల్యే అయ్యాక భవనాలు ఎలా కట్టారో అందరికీ తెలుసన్నారు. కేతిరెడ్డి ఫేస్‌బుక్ లైవ్‌లు పక్కనపెట్టి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పరిటాల శ్రీరామ్ సూచించారు.

Advertisement

Next Story