హీరోలు కాదు ఎంటర్‌టైనర్స్..

by Shyam |
హీరోలు కాదు ఎంటర్‌టైనర్స్..
X

బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఆకట్టుకుంటోంది. సినిమాల్లో నటించే హీరోలను ఇక నుంచి ఎంటర్‌టైనర్స్‌గా పిలిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. నిజమైన హీరోలు.. పోలీసులు, ఆర్మీ అని, వారిని రియల్ హీరోలుగా పిలుచుకుందామని పిలుపునిచ్చారు. మన తర్వాతి తరాలకు రియల్ హీరోస్ అర్థాన్ని పరిచయం చేసేందుకు ఇదే సరైన మార్గమని అన్నారు పరేష్ రావల్. ఈ పోస్ట్‌పై మంచు లక్ష్మీప్రసన్నతో పాటు బాలీవుడ్, టాలీవుడ్ నటీనటులు మద్దతు తెలిపారు. 200% ఇది కరెక్ట్ అని చెప్తున్నారు.

పరేష్ రావల్ తెలుగులో క్షణక్షణం, మనీ మనీ లాంటి చిత్రాల్లో నటించగా.. శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లో ‘లింగం మామ’గా గుర్తింపు పొందారు. పవన్ కళ్యాణ్ తీన్‌మార్ సినిమాలోనూ స్పెషల్ క్యారెక్టర్‌లో కనిపించారు పరేష్ రావల్.

Advertisement

Next Story