పాండాలతో కలిసి భోజనం

by Shyam |
పాండాలతో కలిసి భోజనం
X

దిశ, వెబ్ డెస్క్ :
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాకు ముందు, కరోనా తర్వాత అన్నట్లుగా జీవితం ఉండబోతోంది. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చేంత వరకు.. దాంతో కలిసి బతకాల్సిందేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. లాక్‌డౌన్ ఎత్తేసినా సాధారణ జీవితాన్ని గడపలేం. బయటకు వెళితే ముఖానికి మాస్క్ ధరించాలి. చేతులకు గ్లౌవ్స్ వేసుకోవాలి. శానిటైజర్ వెంట ఉంచుకోవాలి. సోషల్ డిస్టెన్స్ తప్పక మెయింటెన్ చేయాలి. ప్రస్తుత కరోనా నిబంధనలకు అనుకూలంగానే షాపింగ్ మాల్స్, థియేటర్స్, హోటళ్లు, రెస్టారెంట్లు, బస్సులు, రైళ్లు అన్నీ సిద్ధమవుతున్నాయి. అయితే రెస్టారెంట్లో మాత్రం ఒక్కరే తింటే.. తినాలనిపించదు. పైగా లోన్లీగా అనిపిస్తుంది. అలా అని ఇద్దరు కలిసి తినాలంటే.. కరోనా భయంతో పాటు రూల్స్ కూడా ఒప్పుకోవు. అందుకోసం థాయ్‌లాండ్‌లోని ‘మేయ్సన్ సెయ్గన్’ అనే రెస్టారెంట్ ఓ పరిష్కారం చూపింది.

చాలా దేశాల్లో కరోనా విజృంభిస్తున్నప్పటికీ.. ఆర్థిక నష్టాలను పూడ్చుకునేందుకు ఆయా దేశాలు లాక్‌డౌన్‌ను ఎత్తేస్తున్నాయి. కరోనా ఇప్పట్లో పోయేటట్లు లేదని భావించడంతో.. అన్నింటినీ తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. థాయ్‌లాండ్ కూడా గత నెలలో సడలింపులతో లాక్‌డౌన్ ఎత్తేసింది. దాంతో అక్కడ రెస్టారెంట్లు తిరిగి ప్రారంభమయ్యాయి. వైరస్ వ్యాప్తి కాకుండా స్ట్రిక్ట్ రూల్స్ పాటించాల్సిందేనని ప్రభుత్వాలు ఆదేశాలిచ్చాయి. దాంతో రెస్టారెంట్ యజమానులు తమ హోటళ్లలో భౌతిక దూరం పాటించడంతో పాటు, టేబుల్‌కు ఒకరే ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నాయి. అయితే ఒకరే వచ్చి, ఒంటరితనంగా ఫీలై ఏదో కాస్త తినేసి వెళుతుండటంతో మేయ్సన్ సెయ్గన్ రెస్టారెంట్ ఓనర్ నత్వుట్‌కు వింతగా అనిపించింది. దాంతో ప్రతి టేబుల్‌కు రెండు కుర్చీలు వేయించారు. ఒక కుర్చీ కస్టమర్ కోసం, మరో కుర్చి పాండా బొమ్మల కోసం సెట్ చేశారు. దాంతో వినియోగదారులు కూడా ఒంటరితనాన్ని వీడి తమతో కంపెనీగా మరొకరు(పాండా) ఉన్నారనుకుని హ్యాపీగా తింటున్నారని నత్వుట్ తెలిపారు. అంతేకాదు సోషల్ డిస్టెన్స్ కారణంగా కస్టమర్స్‌కు కూడా ఎక్కడ కూర్చోవాలనే కన్ఫ్యూజన్ కూడా ఉండదన్నారు.

Advertisement

Next Story

Most Viewed