- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాన్-ఆధార్ లింక్ చేసుకోలేదా.. గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం
దిశ, వెబ్‌డెస్క్: పాన్-ఆధార్ అనుసంధానానికి గడువును మరోసారి పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కొవిడ్ సెకెండ్ వేవ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మూడు నెలల పాటు గడువును పొడిగిస్తున్నట్టు శుక్రవారం వెల్లడించింది. గతంలో విధించిన జూన్ 30 గడువును విధించిన కేంద్రం దీన్ని సెప్టెంబర్ 30కి మారుస్తున్నట్టు తెలిపింది. ప్రభుత్వం పాన్-ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు ఇప్పటికే నాలుగు సార్లు గడువును పొడిగించింది. తొలుత 2020, మార్చి 31, తర్వాత 2020 జూన్ 30, అనంతరం ఈ ఏడాది మార్చి 31, జూన్ 30కి ఇలా పలు దఫాలుగా పొడిగించింది. దీంతోపాటు మరిన్ని ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఉద్యోగులు కరోనా చికిత్స కోసం కంపెనీలు చెల్లించే మొత్తాన్ని పన్ని మినహాయింపు కిందకు వర్తించేలా నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా, కరోనా కారణంగా ఉద్యోగి మరణిస్తే ఆ వ్యక్తి కుటుంబానికి కంపెనీలు చెల్లించే పరిహారానికి కూడా ఈ మినహాయింపు వర్తించనున్నట్టు స్పష్టం చేసింది. ఇక, ‘వివాద్ సే విశ్వాస్’ పథకాన్ని సైతం ఆగష్టు 31 వరకు పొడిగిస్తూ నిర్ణయాన్ని వెల్లడించింది.