- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దిశ, జమ్మికుంట : టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నన్ని రోజులు ఈటల రాజేందర్.. ముఖ్యమంత్రి పదవి తప్ప అన్ని పదవులు అనుభవించాడని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లందకుంట మండలం వంతడుపుల గ్రామంలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు.
ఎక్కడ సభలు, సమావేశాలు జరిగినా ఈటల రాజేందర్ తనకు అన్యాయం జరిగిందని, నన్ను తక్కువ చేసి చూస్తున్నారని చెప్పు కొస్తున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాజేందర్.. నీకు ఎక్కడ అన్యాయం జరిగిందో చెప్పాలని పల్లా ప్రశ్నించారు. కేబినెట్ సమావేశంలో జరిగిన నిర్ణయాలను బయట పెట్టిన వ్యక్తి ఈటల రాజేందర్ అని, రైతులకు ఉపయోగపడే ధరణి పోర్టల్ గురించి కేబినెట్‌లో చర్చలు జరగగా, ఆ విషయాన్ని రెవెన్యూ అధికారులకు లీక్ చేసి గందరగోళం సృష్టించారని పేర్కొన్నారు.
రైతు బంధు పథకాన్ని వద్దన్న రాజేందర్.. రైతు బంధు కింద వచ్చిన డబ్బులను ఎందుకు తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యాధిగ్రస్తులకు పింఛన్లు అందిస్తుంటే వాటిని పరిగతో పోల్చడం సరికాదని దుయ్యబట్టారు. కాగా, రాచపల్లి గ్రామానికి చెందిన పలువురు వార్డు సభ్యులు టీఆర్ఎస్ పార్టీలో చేరగా, వారికి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.