- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దావూద్ పాక్‌లోనే ఉన్నాడు : నాలుక్కరుచుకున్న పాకిస్తాన్
దిశ, వెబ్ డెస్క్ : గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం తమ దేశంలోనే ఉన్నాడని పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించి తర్వాత నాలుక్కరుచుకుంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ విధించే ఆంక్షలను తప్పించుకోవడానికి దావూద్ సహా 88 మంది పేర్లను పేర్కొంటూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఓ ఉత్తర్వును విడుదల చేసింది. ఇందులో దావూద్ ఇబ్రహీంతోపాటు లష్కర్-ఏ-తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్, 26/11 నిందితుడు జకి ఉర్ రహ్మన్, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ల పేర్లూ ఉన్నారు.
దీంతో దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లో ఉన్నాడనే విషయాన్ని పాకిస్తాన్, భారత్ సహా ఇతర దేశాల మీడియా ప్రచురించాయి. ఈ కథనాలపై ఆదివారం పాక్ ప్రభుత్వం స్పందిస్తూ ఆ కథనాలన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని కొట్టిపారేసే ప్రయత్నం చేసింది. యూఎన్ అనుబంధ సంస్థల సమాచారం ఆధారంగా ఉత్తర్వులను విడుదల చేశామని వివరిస్తూ అందులో పేర్కొన్న వారిపై ఆంక్షలు విధిస్తున్నామని భావించడం అసత్యమని తెలిపింది. అదే విధంగా ఆ జాబితాలోని వారు దేశంలో ఉన్నారని ప్రభుత్వం అంగీకరించిందని వాదించడమూ నిరాధార ఆరోపణేనని పేర్కొంది.