ఇది తెలంగాణకు ప్రత్యేకమైన పండుగ : శశిధర్ రెడ్డి

by Shyam |
Dussehra celebrations
X

దిశ, శంకర్‌పల్లి: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని శంకర్‌పల్లి పీఏసీఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపాలిటీలోని 14వ వార్డులో ఏర్పాటు చేసిన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదానం కౌన్సిలర్ జూలకంటి శ్వేతాపాండురంగారెడ్డి, టీఆర్ఎస్ మున్సిపల్ యూత్ ప్రెసిడెంట్ పాండురంగారెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలో దసరా ఉత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారని, అదేవిధంగా సామూహికంగా బతుకమ్మ ఊరేగింపును ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర్‌పల్లి మున్సిపాలిటీ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ వాసుదేవ్ కన్నా, కాశెట్టి మోహన్, పార్సీ బాలకృష్ణ, సోషల్ మీడియా చైర్మన్ రఘునందన్ రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శ్రీకాంత్, ప్రశాంత్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed