తమిళ్ ఆంథాలజీ ‘పావ కథైగల్’

by Shyam |   ( Updated:2020-11-27 07:36:18.0  )
తమిళ్ ఆంథాలజీ ‘పావ కథైగల్’
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ్ ప్రేక్షకులకు మరో సూపర్ ట్రీట్ రాబోతుంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా డిసెంబర్‌లో తమిళులకు ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ అందించబోతోంది. ఫోర్ సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్స్.. ఫోర్ సూపర్ అమేజింగ్ స్టోరీస్‌తో ఆంథాలజీ సిద్ధం చేసింది నెట్‌ఫ్లిక్స్. సుధ కొంగర, విఘ్నేష్ శివన్, గౌతమ్ మీనన్, వెట్రిమారన్ దర్శకత్వంలో నాలుగు కథల సంగమంగా ‘పావ కథైగల్’ పేరుతో సిరీస్ వస్తుండగా.. ఇందుకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసింది నెట్ ఫ్లిక్స్. ప్రకాష్ రాజ్, సిమ్రన్, సాయి పల్లవి, కల్కి కొచ్లిన్, అంజలి, కాళిదాస్ జయరామ్, భవాని శ్రీ ప్రధాన పాత్రల్లో వస్తున్న సిరీస్ ట్రైలర్ అంచనాలు పెంచగా.. అనిరుధ్ రవిచంద్రన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరింత గ్రిప్పింగ్‌గా ఉంది. డిసెంబర్ 18న సిరీస్‌ రిలీజ్ కానుండగా.. ఆర్‌ఎస్‌వీపీ మూవీస్ బ్యానర్‌పై రోనీ స్క్రువాలా ఈ సిరీస్‌ను నిర్మించారు.

ఈ సిరీస్‌లో ప్రకాష్ రాజ్, సాయి పల్లవి తండ్రీ కూతుళ్లుగా కనిపిస్తుండగా.. వెట్రిమారన్ ఈ కథకు దర్శకుడు. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో వచ్చిన స్టోరీలో అంజలి, కల్కి ప్రధాన పాత్రల్లో నటించగా.. సుధ కొంగర డైరెక్షన్‌లో వచ్చిన కథలో కాళిదాస్ జయరామ్, భవాని శ్రీ మెయిన్ లీడ్‌లో కనిపించనున్నారు. ఇక గౌతమ్ మీనన్ డైరెక్షన్‌లో వస్తున్న స్టోరీలో సిమ్రన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు.

Advertisement

Next Story