- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెల్ఫ్ క్వారంటైన్‌లో పి.గన్నవరం ఎమ్మెల్యే
by srinivas |
X
దిశ ఏపీ బ్యూరో: ఉభయగోదావరి జిల్లాలు కరోనా కాటుకు విలవిల లాడుతున్నాయి. కోయంబేడు మార్కెట్ సెగ కోనసీమను తాకింది. దీంతో ఈ రెండు జిల్లాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం నేదునూరు పెదపాలేనికి చెందిన వైఎస్సార్సీపీ నేత కారణంగా పరిసర గ్రామాల్లో ఇప్పటి వరకు 16 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేసులు నమోదైన నాలుగు గ్రామాలను అధికారులు కంటైన్మెంట్ చేశారు.
దీంతో ఆయనను కలిసిన వారు, వారిని కలిసిన వారు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులో నెగెటివ్ వచ్చినప్పటికీ… ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. తాను స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నానని, తనను ఎవరూ కలిసేందుకు రావొద్దని ఆయన కార్యకర్తలకు సూచించారు.
Advertisement
Next Story