ఆక్సిజన్ పార్కులో ఏర్పాట్ల పరిశీలన

by Shyam |
ఆక్సిజన్ పార్కులో ఏర్పాట్ల పరిశీలన
X

దిశ, హైదరాబాద్: మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయ వద్ద 77 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ పార్కును జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మంగళవారం పరిశీలించారు. పార్కులోని వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, పిక్నిక్ స్పాట్లు చాలా బాగున్నాయని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులను అభినందించారు. ఇక్కడ ఆరోగ్య రీత్యా మనసుకెంతో ఉల్లాసంగా ఉందన్నారు. పార్కులో చేసిన పనులను గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీఎఫ్‌వో సుధాకర్ రెడ్డి, తహసీల్దార్ సురేందర్ రెడ్డి, ఎంపీడీవో పద్మావతి, మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, గుడ్లపోచంపల్లి మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి ఉన్నారు.

Tags: Inspection, collector, oxygen park, works, good atmosphere

Next Story

Most Viewed