- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మరో ఉద్యమం చేద్దాం.. ఓయూ జేఏసీ పిలుపు
దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యమ సమయంలో తీసుకున్న నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ అమలు విషయంలో సీఎం కేసీఆర్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ తేల్చి చెప్పింది. ఆ అంశాలు పూర్తి స్థాయిలో నెరవేరే వరకు ప్రభుత్వంపై బరిగీసీ కొట్లాడుతామని హెచ్చరించింది. ఓయూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఎన్సీసీ గేట్ దగ్గర ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని విద్యార్ధి నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు బైరు నాగరాజు గౌడ్ మాట్లాడుతూ.. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా విద్యార్ధులు, నిరుద్యోగులకు నిరాశే మిగిలిందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఉద్యోగ నోటిఫికేషన్ లు వేస్తానని దొంగ మాటలు చెబుతూ ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1,92, 000 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు.
బతికి సాధిద్దాం…..
సీఎం కేసీఆర్ చేస్తున్న మోసాలతో నిరుద్యోగులు మనోధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడవద్దని నాగరాజు గౌడ్ కోరారు. విద్యార్ధి, నిరుద్యోగుల సమస్యలను బతికి సాధిద్దామని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్పై పోరాటం చేద్దామన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరేందుకు మరో ఉద్యమం చేద్దామని చెప్పారు. ఈ మేరకు విద్యార్ధులు, నిరుద్యోగులు, ప్రజాసంఘాలు, మేధావులంతా సిద్ధంగా ఉండాలన్నారు. ప్రభుత్వ మెడలు వంచి నోటిఫికేషన్లు వచ్చేలా కొట్లాడుదామని వివరించారు. ఈ కార్యక్రమంలో జయశంకర్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్, ఓయూ జేఏసీ అధ్యక్షుడు జక్కుల మధు యాదవ్, ఇట్టబోయిన సాయికుమార్, నవీన్,శ శి ముదిరాజ్, సందీప్, మహేష్, అనంతం స్వామి, పరమేష్ , స్వాతి, శ్వేతా, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.
- Tags
- jac