15 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ మూవీ.. అధికారిక ప్రకటన విడుదల

by Hamsa |   ( Updated:2024-12-05 13:33:51.0  )
15 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ మూవీ.. అధికారిక ప్రకటన విడుదల
X

దిశ, సినిమా: హర్ష నర్రా, సుప్రజ్ రంగా, సందీప్ సరోజ్, తరుణ్(Tarun) హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రోటీ కపడా రొమాన్స్’(Roti Kapda Romance ). విక్రమ్ రెడ్డి(Vikram Reddy) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మేఘ లేఖ, నువేక్ష, సోనియా ఠాకూర్(Sonia Thakur), ఖుష్బూ చౌదరి(Khushboo Chowdhury) హీరోయిన్లుగా నటించారు. యూత్‌ఫుల్ రొమాంటిక్, కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 28న థియేటర్స్‌లో విడుదలై యూత్‌ను మెప్పించింది. ప్రేమ, స్నేహం లాంటి విషయాల్లో నేటితరం ఆలోచన ఎలా ఉంటున్నాయో చూపించి ప్రేక్షకులను ఆలోచింపచేశారు. కానీ హిట్ అందుకోలేకపోయింది. తాజాగా, ‘రోటీ కపడా రొమాన్స్’ మూవీ ఓటీటీ(OTT)లోకి రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ సంస్థ ఈటీవీ విన్(ETV Win) సొంతం చేసుకోగా.. డిసెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు వెల్లడించారు. కేవలం విడుదలైన 15 రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుండటంతో ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు.

Next Story

Most Viewed