- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీచర్ల ఫోన్.. ఇప్పుడొద్దంటున్న తల్లిదండ్రులు
దిశ ప్రతినిధి, నిజామాబాద్: మీ పిల్లలు చదివే పాఠశాలలను ఎప్పుడు తెరవాలి. ఏ నెలలో స్కూళ్లు తెరిస్తే బాగుంటుంది. ఒకవేళ పాఠశాల తెరిస్తే విద్యార్థులు చదువుకునే పాఠశాలల్లో ఎలాంటి చర్యలను విద్యాశాఖ తీసుకోవాలని.. విద్యార్థుల తల్లిదండ్రులను టీచర్లు ఫోన్ చేసి ప్రశ్నలు అడుగుతున్నారు. 2020 విద్యా సంవత్సరం జూన్ 12న ప్రారంభం కావాల్సి ఉన్నా కరోనా మహమ్మారి కారణంగా స్కూళ్లను తెరవలేదు. బడి గంటలు మోగడం లేదు. ఇదే సమయంలో ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల్లో అడ్మిషన్‌లను ప్రారంభించి ఆన్‌లైన్ క్లాస్‌లను షురూ చేశాయి. దీంతో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పాఠశాలల పున: ప్రారంభం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దానికి తోడు కేంద్రం ప్రభుత్వ పాఠశాలలు తెరవాలని అందుకు పలు సలహాలు, సూచనలు చేస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల పున: ప్రారంభంపై తర్జన భర్జన పడింది. రాష్ట్రంలో కరోనా కేసులు పట్టణాల నుంచి పల్లెలకు పాకుతున్నాయి. ఈ సమయంలో ప్రభుత్వం ఆన్‌లైన్ సర్వేకు తెరలేపింది. తల్లిదండ్రుల ఆభిప్రాయాల మేరకు తరగతులు నిర్వహణ ఎలా జరపాలని టీచర్లతో ఆన్‌లైన్ సర్వేను చేపట్టాలని నిర్ణయించింది.
రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నెల 23 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్‌లైన్ సర్వే చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పాఠశాల విద్యాశాఖ రూపొందించిన ఆన్‌లైన్ ఫార్మట్‌లో విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. స్మార్ట్ పోన్ లను పట్టుకుని తమ పాఠశాల్లో చదువుతున్న విద్యార్థుల ఇండ్ల వద్దకు వెళ్లి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. కరోనా కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో విద్యార్థుల తల్లిదండ్రుల ఫొన్ చేసి మాట్లాడుతున్నారు. ఈ నెల 25 వరకు ఉన్న అభిప్రాయాల సేకరణ గడువు ఉండగా, 28 సాయంత్రం వరకు పొడిగించారు. ఈ వివరాలను ఎంఈవోలకు, తరువాత డీఈవో కు పంపనున్నారు.
2020 విద్యా సంవత్సరం ప్రారంభం కాకున్న..
తరగతులు ప్రారంభం కాకున్నా ఆన్‌లైన్, టీవీ ప్రోగ్రాంల ద్వారా విద్యాబోధన జరగాలని ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలు పంపిణీ చేశారు. పాఠ్యపుస్తకాల పంపిణీని టీచర్ల ద్వారా కాకుండా ఎస్‌ఎంసీ, యువజన సంఘాలు, గ్రామ సర్పంచ్‌ల ద్వారా చేయించారు. పట్టణ ప్రాంతాల్లో వైరస్ కేసులు ఎక్కువగా ఉంటాయని వారు వైరస్‌ను మోసుకువస్తారనే అభిప్రాయం మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు అంగీకరించలేదు.
రెండు విధాలుగా సర్వే: శంకర్, పీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు
పాఠశాలలు ఎప్పుడు తెరవాలనే అంశంపై రెండు ఫార్మట్‌లలో ఆన్‌లైన్ సర్వే చేస్తున్నాం. వైరస్ తగ్గలేదు కదా అని కొందరు.. తరగతులు ఎలా నిర్వహిస్తారని మరికొందరు అడుగుతున్నారు. వైరస్ కారణంగా సర్వే లేట్ అవుతుండడంతో గడువు పొడిగించారు. వైరస్ తగ్గితేనే, పిల్లలను బడికి పంపుతామంటున్నారు.
చిన్నపిల్లలకు కష్టమే: రాజ్ గంగారెడ్డి, గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం అధ్యక్షుడు
ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాల సేకరణ జరుగుతుంది. ఆన్‌లైన్ క్లాస్‌లు శాశ్వత పరిష్కారం చూపవు. హైస్కూల్ స్టూడెంట్లకు ఫర్వాలేదు కానీ ప్రాథమిక స్థాయిలో పిల్లలను స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు పంపే పరిస్థితి కనిపించడం లేదు.