ఏపీలో ప్రశాంతంగా కొనసాగుతోన్న బంద్

by srinivas |
Ongoing Bharat Bandh in AP
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ వ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తెల్లవారుజాము నుంచే వామపక్ష నేతలు రోడ్లపై నిరసనలు తెలుపుతున్నారు. వాణిజ్య, వర్తక సంఘాలు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు తెలిపాయి. హోటల్స్, వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు , కాలేజీలకు మేనేజ్ మెంట్లు సెలవు ప్రకటించాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా, వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.విశాఖపట్నం మద్దిలపాలెం జంక్షన్ వద్ద వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా, వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు.

కర్నూలు కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులను వామపక్ష పార్టీల కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో బస్సులు నిలిచిపోయాయి. బెజవాడలో ఉదయం 6గంటల నుండి పండిట్ నెహ్రు బస్టాండ్ వద్ద వామపక్షాలు ఆందోళనకు దిగాయి. అనంతపురం, ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆందోళన చేపట్టాయి. ఉదయం 9 గంటలకు టవర్ క్లాక్ వద్ద బంద్‌లో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర చౌదరి పాల్గొననున్నారు. గుంటూరు బస్టాండ్ వద్ద వామ పక్ష నేతలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ధర్నా చేపట్టాయి.

Advertisement

Next Story