Pahalgam attack: పీవోకే వెంబడి 42 చోట్ల ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్స్

by Shamantha N |   ( Updated:2025-04-24 08:43:22.0  )
Pahalgam attack: పీవోకే వెంబడి 42 చోట్ల ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: పెహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటనలో దేశం ఉలిక్కిపడింది. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతాబలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈక్రమంలోనే దేశంలో ఎంత మంది ఉగ్రవాదులు ఉన్నారు, జమ్ము కశ్మీర్‌లో ప్రస్తుతం ఎన్ని ఉగ్ర స్థావరాలు ఉన్నాయి వంటివి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఎల్ఓసీ వెంట మొత్తంగా 42 ఉగ్ర స్థావరాలు (లాంచ్ ప్యాడ్స్) ఉన్నట్లు గుర్తించారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ వెంబడి ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్స్, శిక్షణ శిబిరాలపై భారత దళాలు నిఘా పెట్టాయి. సైన్యం ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. వ్యూహరచనను రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఆర్మీ వివరించింది. కచ్చితమైన నిఘా విస్తరణ, చొరబాటు నిరోధక గ్రిడ్‌ను బలోపేతం చేయడం వంటి వ్యూహాత్మక ఎంపికలు పరిశీలనలో ఉన్నాయి. జమ్ముకశ్మీర్‌ లోకి చొరబాటు చేసేందుకు వీలుగా ప్రధానంగా 150–200 మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు ప్రస్తుతం వివిధ శిబిరాల్లో మోహరించారని నిఘా వర్గాలు వెల్లడించాయి. పాక్ సైన్యం ఈ చొరబాట్లకు దోహదపడుతోందని, ఇటీవలే బటల్ సెక్టార్ సమీపంలో గణనీయంగా కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ విఫల చొరబాటు ప్రయత్నంలో 642 ముజాహిద్ బెటాలియన్‌కు భారీ ప్రాణనష్టం జరిగిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ఎల్ఓసీ వెంబడి హైఅలెర్ట్

మరోవైపు, పాకిస్థాన్ సైన్యం నియంత్రణ రేఖ వైపు హై అలర్ట్ ప్రకటించింది. భారత్ చర్యను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. భారత్ నుంచి ప్రతీకార చర్యలు ఉంటాయనే నేపథ్యంలో పాక్ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం జమ్ముకశ్మీర్‌లో పాకిస్థాన్ సైన్యం మూడుసార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించింది. భారత సైన్యంతో జరిగిన పోరులో ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. ముఖ్యంగా ఎల్ఓసీ వెంట మొత్తంగా 42 ఉగ్ర స్థావరాలు (లాంచ్ ప్యాడ్స్) ఉండగా.. దేశ వ్యాప్తంగా 125 మంది ఉగ్రవాదులు యాక్టివ్‌గా ఉన్నట్లు గుర్తించారు. అయితే జమ్ము కశ్మీర్‌లోనే మొత్తంగా 115 మంది పాకిస్థానీ టెర్రరిస్టులు ఉన్నట్లు భద్రతా సంస్థలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు కాశ్మీర్‌కు ఎదురుగా ఉన్న 10 లాంచ్ ప్యాడ్లలో 35 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు చెప్పారు. గత ఆరు నెలల్లో 50 చొబరాటు ప్రయత్నాలు జరగ్గా.. అధికారులు తిప్పి కొట్టినట్లు పేర్కొన్నారు. మరికొంత మంది ఉగ్రవాదులు దక్షిణం వైపునుంచి చొరబడి కశ్మీర్ వైపు కదిలినట్లు వివరించారు.

Read More..

Pahalgam Terror attack Behind Pakistan: దాడి పహల్గామ్‌.. ప్లాన్‌ రావల్పిండి.. పాక్‌ కుట్ర బట్టబయలు.. ఏకంగా ఉగ్...


Advertisement
Next Story

Most Viewed