బిగ్ బీ మనవడు రెడీ!

by Shyam |   ( Updated:2020-07-11 06:18:13.0  )
బిగ్ బీ మనవడు రెడీ!
X

భారతీయ సినీ చరిత్రలో బిగ్ బీ అమితాబ్‌ది ఓ సువర్ణ అధ్యాయం. దాదాపు 50 ఏళ్లుగా బాలీవుడ్‌కు సేవలందిస్తున్న బిగ్ బీ.. 77 ఏళ్ల వయసులోనూ అలసిపోకుండా సినిమాలు చేస్తున్నారు. తరాలు మారినా సరే, తన స్టామినా ఏంటో చూపిస్తున్న బచ్చన్ ఫ్యామిలీ నుంచి ఇప్పుడు మరో హీరో రాబోతున్నాడు. తాత బిగ్ బీతో వర్క్‌అవుట్ చేసే మనవడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

బిగ్ బీ కూతురు శ్వేతా బచ్చన్ కొడుకైన అగస్త్య.. తాతను చూసి చిన్ననాడే హీరోగా రాణించాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పటికే నటనలో శిక్షణ పొందిన అగస్త్యకు.. హీరోగా రాణించాలంటే ఫిట్‌నెస్ కూడా ఇంపార్టెంట్ అని తెలుసు. అందుకే అటు వైపు కూడా కాన్సంట్రేట్ చేసి, తాతతో కలిసి వర్క్‌అవుట్ చేసే వీడియోలు కూడా షేర్ చేస్తుంటాడు. సోషల్ మీడియాలో పాపులర్ అయిన అగస్త్యకు భారీ ఫాలోయింగ్ కూడా ఉంది. కాగా ఇప్పుడు అగస్త్య బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం. కథ కూడా ఒకే చేసిన తను.. త్వరలోనే సినిమా షూటింగ్‌‌లో పాల్గొనబోతున్నాడని బాలీవుడ్ టాక్.

Advertisement

Next Story

Most Viewed