- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాలుగేళ్లుగా బాత్‌రూమ్‌లోనే..
దిశ, వెబ్‌డెస్క్: ఒక్క గంట సేపు బాత్‌రూమ్ గడియ పెడితేనే అందులో ఉండటం మహాకష్టం. డోర్ బద్ధలు కొట్టైన బయటకు వచ్చేంత విసుగు రావడం ఖాయం. కానీ, ఓ కుటుంబం గంటలు, రోజులు కాదు ఏకంగా సంవత్సారాల తరబడి బాత్‌రూమ్‌లోనే ఉన్నారు. అక్కడే తింటూ.. ఉంటూ.. జీవనం గడుపుతున్నారంటే వారి దుర్భర స్థితి బాధాకరం. ఈ ఘటన మధ్యప్రదేశ్ టీకాంఘర్ జిల్లా మోహన్‌ఘర్ సమీపంలోని కేశవ్‌ఘర్ గ్రామ పంచాయతీలో వెలుగులోకి వచ్చింది.
ఇదే గ్రామానికి చెందిన మగన్‌లాల్ అహిర్‌వార్ కుటుంబం నాలుగేళ్లుగా బాత్‌రూమ్‌లోనే నివాసం ఉంటున్నారు. అయితే, వీరికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆవాస్ యోజన పథకం రాకపోయినా.. ఉజ్వల పథకం కింద వారికి విద్యుత్ కనెక్షన్, గ్యాస్ కనెక్షన్ కూడా వచ్చింది. ఈ సదుపాయాలతో బాత్‌రూమ్‌లోనే నివాసం ఉంటున్నారు. అహివార్‌కు భార్య నలుగురు పిల్లలు ఉన్నారు. వీరందరూ బాత్‌రూమ్‌లోనే ఉంటూ జీవనం సాగించారంటే నమ్మలేని నిజమనే చెప్పాలి.
బాత్‌రూమ్‌లో ఉంటూ తన కూతురు పెండ్లి కూడా చేశామని అహిర్‌వార్ భార్య పూలాదేవి చెప్పారు. ఎన్ని సార్లు అధికారులను ఇళ్లు మంజూరు చేయాలని చెప్పిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల గృహ నిర్మాణ పథకాలు హామీలకే పరిమితమయ్యాని విమర్శించారు. అయితే, బాధితుల వ్యాఖ్యలపై స్థానిక తహసీల్ధార్ మండిపడ్డారు. అహిర్‌వార్ పూర్వీకుల స్థలం అదే గ్రామంలో ఉందని.. వారు మరుగుదొడ్డిలో నివాసం ఉంటున్నారన్న విషయం తమ దృష్టికి రాలేదని చెప్పడం గమనార్హం.