- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అడవిలో కాల్పులు.. పరుగు అందుకున్న ఎమ్మెల్యే (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ : సమస్యను పరిష్కరిస్తానని వెళ్లిన ఎమ్మెల్యే ఘటన స్థలికి వెళ్లక ముందే ఉన్నపళంగా వెనుదిరిగాడు. ఎక్కడో వినబడిన శబ్ధానికి పరుగు అందుకున్నాడు. ఎమ్మెల్యేను చూసి అప్పటి వరకు ధైర్యంగా ఉన్న కార్యకర్తలు ఆయన పరుగులో అడుగు కలిపారు. అస్సాంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అస్సాం జిల్లాలైన చారిడియో, శివసాగర్, జోర్హాట్, గోలఘాట్, కర్బి అంగ్లాంగ్లు నాగాలాండ్‌తో సరిహద్దును కలిగి ఉన్నాయి. ఈ సరిహద్దు ప్రాంతాల్లో నాగాలాండ్ దురాక్రమణలకు పాల్పడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరియాని ఎమ్మెల్యే రూప్‌జ్యోతి కుర్మి తన సిబ్బంది, కొందరు మీడియా ప్రతినిధులతో కలిసి దేసో వ్యాలీ రిజర్వ్ ఫారెస్ట్‌కు వెళ్లారు. అక్కడి ఆక్రమణలను పరిశీలిస్తున్న టైంలోనే తుపాకుల మోత వినిపించింది. దీంతో ఎమ్మెల్యే పరుగులు అందుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
#Assam #Assammla #assammlaattack pic.twitter.com/AIoEL0Bvht
— ashwik (@ursashwik) May 28, 2021
కాగా, తనను టార్గెట్ చేసే ఆ కాల్పులు జరిగాయని కుర్మి తెలిపారు. అయితే అదృష్టవశాత్తు తామంతా కాల్పుల నుంచి తప్పించుకున్నామని, సమస్యను పరిష్కరించేందుకు అస్సాం ప్రభుత్వం నాగాలాండ్ సర్కారుతో మాట్లాడటం లేదని కుర్మి ఆరోపించారు. కాగా, ఈ కాల్పుల్లు ముగ్గురు రిపోర్టర్లకు గాయాలైనట్లు తెలుస్తోంది.ఈఈ ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ స్పందించారు. వెంటనే అక్కడి పరిస్థితులపై పరిశీలించాలని సీనియర్ పోలీసు అధికారి జీపీ సింగ్‌ను ఆదేశించారు. దీంతో భారీ ఎత్తున పోలీసు బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి.