- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్లాష్.. ఫ్లాష్.. రాష్ట్రంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. డీహెచ్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి జరుగుతోంది. శుక్రవారం మరో ఒమిక్రాన్ పాజిటివ్ కేసు నమోదు కావడంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది. శుక్రవారం హన్మకొండలోని సుబేదారి ప్రాంతానికి చెందిన మహిళకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సదరు మహిళ యూకే నుంచి తెలంగాణకు వచ్చినట్టు సమాచారం. కాంటాక్టుల్లోనూ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలోని టోలిచౌకి పారామౌంట్ కాలనీ మరోసారి కరోనా హాట్‌స్పాట్‌గా మారుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఈ సందర్భంగా డీహెచ్ శ్రీనివాస రావు మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్కరు మినహా నాన్ రిస్క్ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన ఏడుగురిలో ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు తెలిపారు. రాష్ట్రంలో రోజురోజుకూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని అన్నారు. అయినప్పటికీ ఇప్పటివరకూ సామూహిక వ్యాప్తి జరగలేదని వెల్లడించారు. దేశంలోని 11 రాష్ట్రాల్లో 88 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు చెప్పారు. ఒమిక్రాన్‌ను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని, భయపడాల్సిన అవసరంలేదని అన్నారు. కానీ, ఒమిక్రాన్ పట్ల నిర్లక్ష్యంగా ఉండవద్దని హెచ్చరించారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఒమిక్రాన్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అన్నారు. వ్యాక్సిన్ తీసుకోని వారిపై ఒమిక్రాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.
Read More : కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. భవిష్యత్తులో యుద్ధాలు జరుగుతాయి
- Tags
- Increased