ఏపీలో వ్యాక్సిన్ డ్రై రన్ కేంద్రాలివే

by srinivas |   ( Updated:2020-12-25 08:52:50.0  )
ఏపీలో వ్యాక్సిన్ డ్రై రన్ కేంద్రాలివే
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించనున్నారు. వ్యాక్సిన్ డ్రై రన్ కోసం కృష్ణా జిల్లాను కేంద్రం ఎంపిక చేసింది. జిల్లాలో ఈ నెల 28న డ్రై రన్ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు విజయవాడ ప్రభుత్వాస్పత్రి, ఉప్పులూరు పీహెచ్‌సీ, విజయవాడ పూర్ణ ప్రైవేట్ ఆస్పత్రి, ప్రకాశ్ నగర్ అర్బన్ పీహెచ్‌సీ, తాడిగడప ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాక్సిన్ డ్రైవ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. టీకా పంపిణీ సన్నద్దతలో భాగంగా 4 రాష్ట్రాల్లో డ్రై రన్ కేంద్రం నిర్వహిస్తోంది. ఈ నెల 28,29 తేదిల్లో ఏపీతోపాటు పంజాబ్, గుజరాత్, అసోం, రాష్ట్రాల్లో డ్రై రన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed