నాకు ఆ విలేజ్ అంటే చాలా ఇష్టం: కడియం శ్రీహరి

by Sridhar Babu |   ( Updated:2021-12-09 06:48:28.0  )
Kadium-Srihari1
X

దిశ, జఫర్‌గడ్: కేసీఆర్ నేతృత్వంలో చిత్తశుద్ధితో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. గురువారం జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలం ఓబులాపూర్ గ్రామంలో రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నికై మొదటిసారి గ్రామానికి వస్తున్న సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ తీగల కర్ణాకర్ రావు, గ్రామ సర్పంచ్ గార్లపాటి నీరజారెడ్డి అధ్యక్షతన సన్మాన సభ ఏర్పాటు చేసి గ్రామ ప్రజల సమక్షంలో పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ఓబులాపూర్ గ్రామం అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం అన్నారు. గతంలో ఈ గ్రామాన్ని చాలా వరకు అభివృద్ధి చేసుకున్నామని కేసీఆర్ నేతృత్వంలో ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానన్నారు. అనంతరం ముగ్ధుమ్ తండా గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు బానోతు మోహన్ నాయక్ కూతురి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు వెంకట్ స్వామి, అయోధ్య పెద్దిరెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Next Story