హాస్పిటల్లో జాయిన్ అయిన హీరోయిన్.. అభిమానుల ఆందోళన

by Shyam |   ( Updated:2021-08-07 05:24:27.0  )
హాస్పిటల్లో జాయిన్ అయిన హీరోయిన్.. అభిమానుల ఆందోళన
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్ నుశ్రత్ భరుచ ఆస్పత్రిలో చేరింది. బ్లడ్ ప్రెషర్ లెవల్స్ 65/55కు పడిపోవడంతో హాస్పిటల్‌లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. లవ్ రంజన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఆమెను డైరెక్ట్‌గా ముంబైలోని హిందూజ హాస్పటిల్‌కు తీసుకెళ్లగా.. షూటింగ్ నిలిచిపోయింది. టైమ్ సేవ్ అవుతుందని ఇంట్లో కాకుండా షూటింగ్‌ స్పాట్‌కు సమీపంలో ఉన్న హోటల్లోనే స్టే చేస్తున్నానని తెలిపిన నుశ్రత్.. మూడు వారాల షూటింగ్ తర్వాత బలహీనంగా అనిపించిందని, దీంతో ఆ రోజు బ్రేక్ తీసుకున్నానని వివరించింది. నెక్స్ట్ డే హెల్త్ బాగుంటుందని భావించినా.. మరింత వరెస్ట్‌గా తయారైందని చెప్పింది. బీపీ లెవల్ 65/55కు పడిపోవడంతో అప్ స్టేర్స్‌కు వెళ్లేందుకు వీల్ చెయిర్ యూజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపింది నుశ్రత్. ప్రస్తుతం హెల్త్ బాగానే ఉందని, కొన్ని రోజులు విరామం తీసుకుంటే అంతా సెట్ అవుతుందని వైద్యులు సూచించారని చెప్పింది.

Advertisement

Next Story