- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీలో కొత్తగా 295 కరోనా కేసులు
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో 59,410 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 295మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,84,171కు చేరింది. ఒకరు చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,126గా ఉంది. ప్రస్తుతం 2,822 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,74,223మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 368మంది డిశ్చార్జ్ అయ్యారు.
అనంతపురం జిల్లాలో 30మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా చిత్తూరులో 39, తూర్పుగోదావరిలో 32, గుంటూరులో 35, కడపలో 10, కృష్ణా జిల్లాలో 45, కర్నూలులో 12, నెల్లూరులో 24, ప్రకాశంలో 12, శ్రీకాకుళంలో 9, విశాఖపట్నంలో 22, విజయనగరంలో 4, పశ్చిమగోదావరి జిల్లాలో 4 కేసులు వచ్చాయి. కరోనా మహమ్మరి బారిన పడి కృష్ణా జిల్లాలో ఒకరు చనిపోయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.
Next Story