ఏపీలో కొత్తగా 349 కరోనా కేసులు

by srinivas |
ఏపీలో కొత్తగా 349 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల్లో 46,386 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 349మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,81,061కి చేరింది. ఇద్దరు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 7,094గా ఉంది. ప్రస్తుతం 3,625 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8.7లక్షల మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 422మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కోటి 16లక్షల మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

చిత్తూరు జిల్లాలో 105 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా కృష్ణాజిల్లాలో 67, గుంటూరులో 34, అనంతపురంలో 31, విశాఖలో 28, తూర్పుగోదావరి జిల్లాలో 27, కడపలో 17, నెల్లూరులో 11, కర్నూలులో 10, ప్రకాశం జిల్లాలో 8, శ్రీకాకుళంలో 10, పశ్చిమగోదావరి జిల్లాలో 3 కేసులు వచ్చాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కరోనా మహమ్మారి బారిన పడి కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed