- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NTR 31 : ఎట్టకేలకు కన్ఫార్మ్ చేసిన ప్రశాంత్ నీల్
దిశ, వెబ్‌డెస్క్: నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ట్విట్టర్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. కరోనా కారణంగా ఎన్టీఆర్ బర్త్ డే సెలబ్రేట్ చేసుకోకపోవడం వారికి కొంత నిరాశను మిగిల్చినా ఆయన సినిమాలనుండి వస్తున్న అప్ డేట్స్ ని సోషల్ మీడియా లో షేర్ చేస్తూ రచ్చచేస్తున్నారు. ఈ ఉదయమే ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి ఎన్టీఆర్ ఇంటెన్సివ్ లుక్ విడుదల కావడంతో అభిమానులు పండగ చేసుకొంటున్నారు. ఇక ఈ సినిమా అప్ డేట్ తో పాటు అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబో కి సంబంధించిన భారీ అప్ డేట్ రావడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆనందంలో ఎగిరి గంతులేస్తున్నారు.
‘కెజిఎఫ్’ చిత్రంతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ ‘సలార్’ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలు వాళ్లు, వీళ్లు అనడమే తప్ప ఎన్టీఆర్ కానీ, ప్రశాంత్ నీల్ కానీ కన్ఫర్మ్ చేయలేదు. అంతలోనే లాక్ డౌన్ కూడా వచ్చేసింది. ఈ గ్యాప్ తర్వాత తారక్ నుంచే మళ్ళీ క్లారిటీ రావడంతో ఆ అధికారిక అప్డేట్ కోసం ఎదురు చూడడం మొదలు పెట్టారు. ఇక తాజాగా ఈ విషయంపై డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చేశారు నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలుపుతూ ఆయన ఒక ట్వీట్ చేశారు.
https://twitter.com/prashanth_neel/status/1395274100080218115
“రక్తంతో తడిచిన మట్టిని చరిత్ర ఎన్నటికీ మరువదు.. ఈ ఒకే ఒక్క ఫోర్స్ తో సినిమా చెయ్యడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా .. హ్యాపీ బర్త్ డే బ్రదర్” అంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ ఒక్క ట్వీట్ తో ట్విట్టర్ షేక్ అయిపోయింది. మాస్ ఎలివేషన్స్ డైరెక్టర్ ఒక వైపు.. మాస్ కే ట్రెండ్ సెట్ చేసిన హీరో మరోవైపు .. ఈ ఇద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాకుండా సినీ అభిమానులు సైతం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.