కుక్కలు, పిల్లుల కోసం ‘పెట్ రిజిస్ట్రేషన్ యాప్’

by Shyam |
Dog
X

దిశ, ఫీచర్స్ : ఇటీవల కాలంలో పెంపుడు జంతువులను పెంచుకోవడం సర్వసాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో పెంపుడు జంతువుల యజమానుల సంక్షేమాన్ని ప్రోత్సహించే క్రమంలో నోయిడా అధికారులు ‘పెట్ రిజిస్ట్రేషన్’ పేరుతో ఓ ఆండ్రాయిడ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. నోయిడాలో పెంపుడు జంతువులను కలిగినవారంతా ఇకపై వారి పెట్స్‌కు రిజిస్ట్రేషన్ చేయించాలని అధికారులు చెబుతున్నారు.

నోయిడా అథారిటీ పెట్ రిజిస్ట్రేషన్ (NAPR) యాప్‌‌లో తమ పెంపుడు జంతువు వివరాలు నమోదు చేసి, ఫొటో అప్‌లోడ్ చేయాలి. రిజిస్ట్రేషన్ కోసం ఏడాదికి వెయ్యి రూపాయలు చెల్లించాలి. అలాగే ఏడాది పూర్తయిన తర్వాత రెన్యువల్ చేయించాలి. బహిరంగ ప్రదేశాల్లో పెంపుడు జంతువులకు సంబంధించిన చెత్తాచెదారం వేసినా లేదా అంతరాయాలను సృష్టించినా నివాసితులు వాటిపై ఫిర్యాదు చేయవచ్చు. ఈ పెట్స్ మీద ఎటువంటి కంప్లయిట్స్ వచ్చిన దానికి పూర్తి బాధ్యతతో పాటు, దాని యజమాని జరిమానా చెల్లించాలి.

pets,

సంబంధిత అథారిటీ నుంచి అధికారిక పెట్ లైసెన్స్ పొందిన తరువాత, పెంపుడు జంతువులను కలిగి ఉన్న వ్యక్తులు15 రోజుల్లోపు యాజమాన్యాన్ని అధికారులకు తెలియజేయాలి. యజమానులు పార్కు, వీధి, రోడ్లు మొదలైన ఏ బహిరంగ ప్రదేశంలోనూ కుక్కను విచ్చలవిడిగా వదిలివేయకూడదు. రహదారులు, వీధులు, ఉద్యానవనాలు మొదలైన ప్రదేశాలలో బహిరంగ మలవిసర్జనకు అనుమతించరాదు.

‘పెంపుడు జంతువు లేదా కుక్క సంరక్షణ మరియు సౌకర్యం విషయంలో పొరుగువారు మరియు ఏ ఇతర వ్యక్తికి ఇబ్బంది కలగకుండా ఉండటం యజమాని బాధ్యత పొరుగువారికి లేదా ఏ వ్యక్తికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వాణిజ్య - అమ్మకాల కొనుగోలు ప్రయోజనాల కోసం’ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. స్థానిక అధికార సంస్థకు లైసెన్స్ ఫీజు చెల్లించాల్సిన బాధ్యత కలిగిన పెంపుడు జంతువు యజమాని చనిపోయినా లేదా పెంపుడు జంతువును విక్రయించినా లేదా పెంపుడు జంతువును వేరే ప్రదేశానికి లేదా వ్యక్తికి బదిలీ చేసినా, ఈ సమాచారాన్ని తప్పనిసరిగా రాతపూర్వకంగా తెలియజేయాలని అధికార యంత్రాంగం తెలియజేసింది

Advertisement

Next Story