క్రిప్టో కరెన్సీలతో ఒప్పందాలు వద్దు : BCCI

by Shyam |
క్రిప్టో కరెన్సీలతో ఒప్పందాలు వద్దు : BCCI
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ కీలక సూచన చేసింది. వచ్చే సీజన్ కోసం టీమ్ స్పాన్సర్లుగా క్రిప్టో కరెన్సీ, బెట్టింగ్ సంస్థలను నియమించుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. బెట్టింగ్ సంస్థల వాణిజ్య ప్రకటనలను ఏ రూపంలో కూడా ఫ్రాంచైజీలు ప్రమోట్ చేయవద్దని బీసీసీఐ పేర్కొన్నది. అలాగే క్రిప్టో కరెన్సీలపై ఇండియాలో ఇంకా స్పష్టత రానందున వాటిని కూడా పక్కకు పెట్టాలని బీసీసీఐ సూచించింది.

ఇటీవల క్రిప్టో కరెన్సీ సంస్థలతో కొన్ని ఫ్రాంచైజీలు వాణిజ్య ఒప్పందాలు కుదర్చుకోవడానికి సిద్దపడినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలోనే బోర్డు ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తున్నది. క్రికెట్ మ్యాచ్‌లు జరిగే సమయంలో కాయిన్ డీసీఎక్స్, కాయిన్ స్విచ్ కూబర్, వాజిర్‌ఎక్స్ అనే క్రిప్టో కరెన్సీ సంస్థలు భారీగా ప్రకటనలు ఇస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్, శ్రీలంక పర్యటన సమయంలో ఈ సంస్థలే అధికంగా ప్రకటనలు ఇచ్చాయి. ముఖ్యంగా డిజిటల్ స్ట్రీమింగ్ సమయంలోఈ ప్రకటనలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీలపై కన్నేసాయి. ముందు జాగ్రత్త చర్యగానే బీసీసీఐ ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed