భయంతో అరెస్ట్ చేశారు.. ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదు

by Sridhar Babu |   ( Updated:2021-07-29 04:29:56.0  )
భయంతో అరెస్ట్ చేశారు.. ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదు
X

దిశ,భువనగిరి రూరల్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయాలని మరియు1.9 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ, కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు గురువారం రోజు హైదరాబాద్ లోని ధర్నా చౌక్ వద్ద ధర్నా తల పెట్టారు. అయితే ఆ ధర్నాకు వెళ్ళకుండా ముందస్తుగా బీజేపీ, BJYM నాయకులను భువనగిరి,ఆలేరు పట్టణాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా బీజెవైయం భువనగిరి జోనల్ ఇంచార్జ్ పట్నం కపిల్ మాట్లాడుతూ.. ప్రగతి భవన్ ముట్టడిస్తామని అపోహతో రాష్ట్ర ప్రభుత్వం భయపడి ముందస్తుగా అక్రమంగా అరెస్ట్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అలాగే కేసీఆర్ ప్రభుత్వం బీజేపీ నాయకుల ఫోన్ ట్యాప్ చేస్తూ వారు మాట్లాడుకున్న విషయాలు వింటూ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని, అరెస్టులతో తమను భయానికి గురి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని పేర్కొన్నారు. ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా భయపడి ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని కెసీఆర్‌ని గద్దె దింపే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు కనుకుంట్ల రమేష్, గాదె లక్ష్మణ్, తుమ్మల నగేష్, ఏర్పుల శివ ప్రసాద్, కడారి శివ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed