‘ఐరిష్ కోసం మీసేవ కేంద్రాలకు వెళ్లవలసిన అవసరం లేదు’

by Shyam |
‘ఐరిష్ కోసం మీసేవ కేంద్రాలకు వెళ్లవలసిన అవసరం లేదు’
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: రేషన్ సరుకులు పొందేందుకు వినియోగదారులు ఐరిష్ కోసం మీసేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ స్పష్టం చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్వేతమహంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ సమాచారం పంపారని, రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీకి బయోమెట్రిక్ ఆతంటికేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆమె తెలిపారు. అయితే ప్రత్యామ్నాయంగా ఐరిష్, ఓటిపి ఏర్పాటు చేయడం జరిగిందని, కానీ చాలా మంది రేషన్ కార్డ్ వినియోగదారులు మొబైల్ నెంబర్‌లో ఆప్డేషన్ కోసం అనవసరంగా మీ-సేవ కేంద్రాలకు వెళ్తున్నారని పేర్కొన్నారు.

రేషన్ పొందేందుకు ముందుగా వినియోగదారులు ఐరిష్ తీసుకోవాలని,ఒకవేళ ఐరిష్ తీసుకోని పక్షంలో ఓటిపి తీసుకోవాలని చెప్పారు. ఎవరికైనా కంటి సమస్యలు ఉన్నట్లైతే వాళ్ళు మాత్రమే ఓటిపి తీసుకోవాలని, కంటి సమస్యలు మొబైల్ అప్డేట్ కానీ వాళ్ళు మాత్రమే మీ- సేవ కేంద్రాలకు వెళ్లాలని కలెక్టర్ సూచించారు. అందువల్ల జిల్లాలోని రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులు అందరూ ముందుగా ఐరిష్ తీసుకోవాలని ,అది కుదరని పక్షంలో ఓటిపి తీసుకోవాలని మరియు మొబైల్ నెంబర్లు అప్డేట్ చేయని వాళ్ళు మాత్రమే మీ- సేవ కేంద్రాలు లేదా ఆధార్ కేంద్రాల కు వెళ్లాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ తెలిపినట్లు కలెక్టర్ వివరించారు.

Advertisement

Next Story

Most Viewed