రోజుకు కనీసం మూడు ప్రాజెక్ట్స్ అయినా రిజెక్ట్ చేస్తున్నా.. దయచేసి నోటికొచ్చింది మాట్లాడొద్దంటూ డైరెక్టర్ వార్నింగ్

by Hamsa |   ( Updated:2025-04-18 10:59:39.0  )
రోజుకు కనీసం మూడు ప్రాజెక్ట్స్ అయినా రిజెక్ట్ చేస్తున్నా.. దయచేసి నోటికొచ్చింది మాట్లాడొద్దంటూ డైరెక్టర్ వార్నింగ్
X

దిశ, సినిమా: బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) ‘పాంచ్’ చిత్రంతో ఇండస్ట్రీకి వచ్చారు. ఇక ఆ తర్వాత పలు సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకులను అలరించారు. చివరగా ఆయన ‘కెన్నడీ’ చిత్రంతో వచ్చారు. మళ్లీ ఏడాది తర్వాత ఆయన ‘డెకాయిట్’ (Dacoit)లో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీతోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. అడివి శేష్(Adivi Sesh), మృణాల్(Mrunal Thakur) జంటగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) తాను బాలీవుడ్ ఇండస్ట్రీని వదిలేస్తున్నానంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే.

ఇక ఈ విషయంపై పలువురు నెటిజన్లు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. రిటైర్‌మెంట్ అని చెప్పకుండా ఇవన్నీ చెప్తున్నాడని పలు పోస్టులు పెడుతున్నారు. తాజాగా, ఈ విషయంపై అనురాగ్ కశ్యప్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తనపై విమర్శలు చేస్తున్న వారికి వార్నింగ్ ఇచ్చారు. ‘‘నేను సిటీ మారాను అంతే సినిమా నిర్మాణాన్ని వదిలిపెట్టలేదు. ప్రస్తుతం డైరెక్టర్‌గా నా చేతిలో ఐదు చిత్రాలున్నాయి. మూడు ఈ ఏడాది రిలీజ్ అవుతాయి. మరో రెండు వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్తాయి. అసలు నేను క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాను.

దీనివల్ల రోజుకు ఓ మూడు ప్రాజెక్ట్స్ అయినా రిజెక్ట్ చేయాల్సి వస్తుంది. నేను షారుఖ్ ఖాన్ కంటే కూడా బిజీగా ఉన్నాను. నా దగ్గర అత్యంత పొడవైన IMDB ఉంది. నేను పనిలో బిజీ అయిపోయాను. నా దగ్గర 2028 వరకు తేదీలు ఖాళీ లేవు. కాబట్టి మీరంతా నోటికొచ్చింది మాట్లాకుండా మీ పని చేసుకోండి. అంతే కానీ మీరు సొంతంగా ఊహించుకుని ఏవేవో అనకుండా నోరు మూసుకోండి’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం అనురాగ్ కశ్యప్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Click For Tweet Post...



Next Story