JEE Final Key : ఎట్టకేలకు జేఈఈ మెయిన్స్ 'కీ' విడుదల

by M.Rajitha |
JEE Final Key : ఎట్టకేలకు జేఈఈ మెయిన్స్ కీ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : గురువారం విద్యార్థులను తీవ్ర గందరగోళంలో పడేసిన జేఈఈ మెయిన్స్ ఫైనల్ 'కీ'(JEE Main Final Key) ఎట్టకేలకు నేడు విడుదల అయింది. వీటికి సంబంధించిన ఫలితాలు రేపు విడుదల కానున్నట్టు ఎన్టీఏ(NTA) ప్రకటించింది. ఫైనల్ కీ కోసం https://jeemain.nta.nic.in/ వెబ్సైట్ లో చెక్ చేసుకోవాలని తెలిపింది. అయితే మెయిన్స్ ఫైనల్ 'కీ'ని నిన్ననే విడుదల చేసినప్పటికీ.. దానిలో కొన్ని తప్పులు ఉన్నాయని గుర్తించింది. ఆ వెంటనే అధికారిక వెబ్సైట్ నుంచి దానిని తొలగించడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు అయోమయానికి గురయ్యారు. జరిగిన పొరబాట్లను సవరిస్తూ శుక్రవారం ఫైనల్ కీ విడుదల చేయడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.


Advertisement
Next Story

Most Viewed