బ్రేకింగ్.. మెడికల్ షాపుల్లో ‘నో మాస్క్’ నో మెడిసిన్..

by Anukaran |   ( Updated:2021-04-01 08:34:54.0  )
బ్రేకింగ్.. మెడికల్ షాపుల్లో ‘నో మాస్క్’ నో మెడిసిన్..
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మెడికల్ షాపులను అప్రమత్తం చేసింది. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మెడికల్ షాపుల్లో ‘నో మాస్క్’ నో మెడిసిన్ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ ఉంటేనే మందులు ఇవ్వాలని ఆదేశించింది. దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో వచ్చే వాళ్లకు డాక్టర్ ప్రిస్ర్కిక్షన్ లేకుండా మందులు అమ్మవద్దని తెలిపింది. అటువంటి లక్షణాలున్న వాళ్ళను ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్ళమని సూచించాలని ప్రభుత్వం కోరింది.

Advertisement

Next Story