అలాంటి ఇబ్బందికర సందర్భాలు ఎదుర్కొన్నా: నివేదా

by Jakkula Samataha |
అలాంటి ఇబ్బందికర సందర్భాలు ఎదుర్కొన్నా: నివేదా
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో నటించడం స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ అని తెలిపింది నివేదా థామస్. పవన్‌కు భాష మీద ఉన్న పట్టు చూస్తుంటే ఆశ్చర్యం కలిగేదని చెప్పింది. ‘వకీల్ సాబ్’ సినిమా ఎక్స్‌పీరియెన్స్ గురించి తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. పవన్ చాలా మంచి వ్యక్తి అని, సెట్స్‌లో క్యారెక్టర్స్, సీన్స్ గురించి ఎప్పటికప్పుడు చర్చించే వాళ్లమని చెప్పింది. డైరెక్టర్ శ్రీరామ్ వేణు మీద నమ్మకం ఉందన్న నివేద.. ‘వకీల్ సాబ్’ సినిమాకు, తన క్యారెక్టర్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని తెలిపింది.

సినిమాలు చూసి రాత్రికి రాత్రి ఎవరూ మారిపోరు, స్వభావాలు మారవన్న హీరోయిన్.. కానీ తప్పు చేస్తున్నామనే ఒక ఆలోచన మాత్రం మొదలవుతుందని నమ్మకం వ్యక్తం చేసింది. తాను కూడా సినిమాలో మాదిరి ఇబ్బందికరంగా ఉండే కొన్ని సందర్భాలు ఎదుర్కొన్నానని పేర్కొంది. ‘వకీల్ సాబ్’ చూశాక అలాంటి చర్చ మొదలైందని తెలిపింది. మహిళల గురించి తప్పుగా మాట్లాడటం సరికాదని, మనసులో ఉన్న దురుద్దేశంతో ఇష్టారీతిన ఊహించుకోవడం తప్పనే ఆలోచనలు మొదలయ్యాయని తెలిపింది. మహిళలు చెప్పేది నచ్చినా నచ్చకపోయినా..కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వాలని ప్రేక్షకులు భావిస్తున్నారని తెలిపింది నివేదా థామస్.

Advertisement

Next Story