సెంట్రల్ బ్యాంక్, ఐఓబీ బ్యాంకుల ప్రైవేటీకరణకు నీతి ఆయోగ్ సిఫార్సు..

by Harish |   ( Updated:2021-06-07 04:44:31.0  )
సెంట్రల్ బ్యాంక్, ఐఓబీ బ్యాంకుల ప్రైవేటీకరణకు నీతి ఆయోగ్ సిఫార్సు..
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ప్రైవేటీకరణలో భాగంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(బీఓబీ)లలో ప్రభుత్వం వాటాను విక్రయించేందుకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-2022 కేంద్ర బడ్జెట్‌లో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక సాధారణ బీమా కంపెనీని ప్రైవేటీకరించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆత్మ నిర్భర భారత్ కోసం కొత్త పీఎస్ఈ(పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్) విధానం ప్రకారం.. వ్యూహాత్మక రంగాల్లోని ప్రభుత్వ రంగ సంస్థలను విలీనం చేయడం, ప్రైవేటీకరించడం లేదా ఇతర ప్రభుత్వ సంస్థల అనుబంధ సంస్థలుగా చేర్చడంపై నీతి ఆయోగ్ సూచనలిస్తుంది.

పలు నివేదికల ప్రకారం వీటితో పాటు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణకు కూడా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. నీతి ఆయోగ్ సిఫార్సు అనంతరం డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ మెనేజ్‌మెంట్(దీపమ్) ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్(డీఎఫ్ఎస్) ఈ ప్రతిపాదనను పరిశీలించి, బ్యాంకుల ప్రైవేటీకరణకు అవసరమైన మార్పులపై చర్చించనున్నాయి. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్రం మొత్తం రూ. 1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని కలిగి ఉంది.

Advertisement

Next Story